Wanted Pandugad prerelease
శతాధిక చిత్ర దర్శకుడు.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో యునైటెడ్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులుగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో సాయిబాబ కోవెల మూడి, వెంకట్ కోవెల మూడి నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం వాంటెడ్ పండుగాడ్. పట్టుకుంటే కోటి ట్యాగ్ లైన్. ఈ చిత్రం ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ బిగ్ టికెట్ లాంఛ్ చేశారు ...
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా దేశమంతా ఆనందంగా ఉంది. సినిమాలకు పూర్వ వైభవం వచ్చింది. సీతారామం, బింబిసార, కార్తికేయ 2 వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. రేపు థియేటర్స్‌లో మన సినిమా వాంటెడ్ పండుగాడ్ రిలీజ్ అవుతుంది. నా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ పి.ఆర్, డైరెక్టర్ శ్రీధర్ సీపాన సహా ప్రతి ఒక టెక్నీషియన్ ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే ఆర్టిస్టులు ఎంతగానో కో ఆపరేట్ చేశారు. ఎంటర్‌టైనింగ్ మూవీగా వాంటెడ్ పండుగాడ్ ఆగస్ట్ 19న మూవీ రిలీజ్ అవుతుంది అన్నారు.
సునీల్ మాట్లాడుతూ రాఘవేంద్రరావుగారి సినిమాల్లో పళ్లు ఉంటాయి. కానీ ఈ సినిమాలోనే పండుంది. సాధారణంగా దేవుడు (గాడ్) దగ్గరకి పళ్లు తీసుకెళతాం కదా.. అందుకే పండు, గాడ్ అని రెండింటినీ టైటిల్‌లో పెట్టాం. ఇప్పటి సినిమాల్లో కమెడియన్స్ నటిస్తున్న వారందరం ఇందులో నటించాం. నేను కూడా చాలా కీలకమైన పాత్రలో నటించాను. మాతో పాటు నా తమ్ముడు.. శ్రీధర్ సీపానకు వాంటెడ్ పండుగాడ్ సినిమా చాలా మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను.నిర్మాతలకు ఈ సినిమా చాలా ఎక్కువగా డబ్బులు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.
అనసూయ మాట్లాడుతూ ప్యాక్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ వాంటెడ్ పండుగాడ్ ఆగస్ట్ 19న రిలీజ్ అవుతుంది. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. రాఘవేంద్రరావుగారికి థాంక్స్. టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో ఆయన తర్వాతే ఎవరైనా. షూటింగ్‌ను మేం ఎంజాయ్ చేశాం. రేపు సినిమా చూస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. శ్రీధర్‌గారి టాలెంట్‌ను రేపు థియేటర్‌లో చూస్తారు అన్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత మంది కమెడియన్స్ ఇండియాలో ఎక్కడా లేరు. ఇప్పటికీ కమెడియన్స్ సంఖ్య విషయంలో మన ఇండస్ట్రీనే టాప్. ఎంటర్‌టైన్మెంట్, కామెడీని నేను ఇష్టపడతాను. అందుకని కమెడియన్స్ నాకు ఇష్టమే కాదు.. గౌరవం కూడా. రాఘవేంద్రరావుగారికి ఎంత వయసు వచ్చినా పళ్లను వదలరని చెప్పటానికే ఈ టైటిలే నిదర్శనం. ఆయనకు పండే దేవుడు. అందుకే వాంటెడ్ పండుగాడ్ అనే టైటిల్‌ను పెట్టారు. పాండమిక్ సమయంలో రాఘవేంద్రరావుగారు రెండు సినిమాలను తీసేశారు. ఆయన స్పీడు చాలా మందికి ఇన్‌స్పిరేషన్. సునీల్, సుధీర్, పృథ్వీ సహా అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.
చిత్ర దర్శకుడు శ్రీధర్ సీపాన మాట్లాడుతూ ఈ 19న హిట్ కొట్టబోతున్నాం. గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నాను. మూడు సినిమాలను డైరెక్ట్ చేస్తున్నా.. రాఘవేంద్రరావుగారి వాంటెడ్ పండుగాడ్ సినిమా ముందు రిలీజ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ పి.ఆర్, కెమెరామెన్ మహీరెడ్డి, ఎడిటర్ తమ్మిరాజుగారు , ఆర్ట్ డైరెక్టర్ కిరణ్‌గారు సహా నా డైరెక్షన్ టీమ్ నాకు అందించిన సపోర్ట్ మాటల్లో చెప్పలేనిది. రాఘవేంద్రరావుగారి ఋణం తీర్చుకోలేనిది అన్నారు.
రైటర్ బి.వి.ఎస్.రవి మాట్లాడుతూ సాధారణంగా జీవితంలో ఎక్కువ ఆనంద పడుతూ తక్కువ కష్టపడటం అనేది మన గోల్. అయితే ఎప్పుడూ ఆనందంగా ఉండటం అనేది గేట్రెస్ట్ అచీవ్‌మెంట్. అలా ఎప్పుడూ ఆనందంగాఉంటూ, సినీ పరిశ్రమలో తన తోటి వారికి కూడా ఆనందాన్ని పంచే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుగారు. శ్రీధర్ సీపానతో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. రైటర్‌గా ఎన్నో సినిమాలకు తను వర్క్ చేశాడు. సునీలన్న తనను ఎంతో ఎంకరేజ్ చేశాడు. ఈ సినిమాతో తను దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తనకు జనార్ధన మహర్షి రైటర్‌గా సపోర్ట్‌గా నిలవటం ఆనంద పడే విషయాలే. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ రాఘవేంద్రరావుగారి సినిమాలో వర్క్ చేయటాన్ని ఎప్పుడూ ఎంజాయ్ చేసేవాళ్లం. ఎందుంకటే ఆర్టిస్టులు కష్ట సుఖాలను ముందుగానే తెలుసుకుని షూటింగ్ చేసేవాళ్లలో ఆయన ముందుంటారు. శ్రీధర్ సీపాన మంచి రైటర్. తను ఇప్పుడు దర్శకుడి స్థాయికి ఎదిగాడు. సునీల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనతో పాటు నేటి తరానికి చెందిన కమెడియన్స్ చాలా మంది నటించారు. సినిమా ప్రేక్షకులకు బ్రహ్మాండమైన విందు భోజనంలాంటి సినిమా కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాఘవేంద్రరావుగారి దర్శకత్వ పర్యవేక్షణ అనగానే వాంటెడ్ పండుగాడ్ సినిమా చేయటానికి ఓకే చెప్పాను. ఇందులో బోయపాటి బాలయ్య అనే క్యారెక్టర్ చేశాను. డైరెక్టర్ శ్రీధర్ సీపాన, రైటర్ జనార్ధన మహర్షిగారు ప్రతి పాత్రను చక్కగా తీర్చిదిద్దారు. మంచి సంగీతం కుదిరింది. సునీలన్న, సప్తగిరన్న, సుధీర్ అందరితో కలిసి చక్కటి కామెడీని పండించాం. నా గర్ల్‌ఫ్రెండ్‌గా వసంతి నటించారు. బ్రహ్మానందంగారు మరో ఎక్సలెంట్ క్యారెక్టర్‌ను చేశారు అన్నారు.
థర్టీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ రాఘవేంద్రరావుగారి గురించి ఓరోజు ఆఫీసుకి పిలిపించి నీ జీవితంలో ఏదో జరిగిందని అనుకుంటున్నావు. అదేం లేదు.. నువ్వు నటించటానికి పుట్టావు దాని మీద కాన్‌సన్‌ట్రేషన్ చేయి అని అన్నారు. పూల రంగడు, భీమవరం బుల్లోడు, లౌక్యం వంటి సినిమాలకు శ్రీధర్ సీపాన అద్భుతమైన మాటలు రాశాడు. సినిమా గొప్ప హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
శ్రీలీల మాట్లాడుతూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటంలో రాఘవేంద్రరావుగారు ఎప్పుడూ ముందుంటారు. అందులో మరో ప్రయత్నమే ఈ సినిమా. ఇంత మంది కమెడియన్స్ నటించిన వాంటెడ్ పండుగాడ్ సినిమా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందో ఊహించుకోవచ్చు. సినిమా ఆగస్ట్ 19న సినిమా రిలీజ్ అవుతుంది. యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అన్నారు.
హీరో రోషన్ మాట్లాడుతూ రాఘవేంద్రరావుగారు అందరితో చక్కగా, జోవియల్‌గా ఉంటారు. త్వరలోనే ఆయన హీరోగా కూడా కనిపిస్తారని అనుకుంటున్నాను. శ్రీధర్ సీపానగారు మా పెళ్లి సందడి సినిమాకు రైటర్‌గా వర్క్ చేశారు. ఈసినిమాను ఆయన డైరెక్ట్ చేశారు. సునీలన్న, అనసూయగారు, దీపికగారు సహా టీమ్‌కు ఆల్ ది బెస్ట్. వాంటెడ్ పండుగాడ్ను సినిమాను పెద్ద హిట్ చేయాలని అనుకుంటున్నాను అన్నారు.