Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముగ్గురు వ్యక్తుల కోసం ఇద్దరి నియంతృత్వ పాలన

Advertiesment
rahul gandhi
, శుక్రవారం, 5 ఆగస్టు 2022 (12:11 IST)
పెట్రోల్, నిత్యావసరాల ధరలు పెరుగుదలపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు దిగింది. నేటి నుంచి పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో ఈ నిరసనలు కొనసాగించనున్నట్లు వెల్లడించింది. 
 
ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, పలువురు సీనియర్ నేతలు మీడియా సమావేశం నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా నిరసించారు. 
 
విపక్షాలపై ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోన్న తీరు నియంతృత్వ పాలన ప్రారంభాన్ని సూచిస్తోందని రాహుల్ మండిపడ్డారు. 
 
'ధరల పెరుగుదల, నిరుద్యోగం, సమాజంలో చోటుచేసుకుంటున్న హింస వంటి ప్రజా సమస్యలు లేవనెత్తకూడదు. వాటిని ప్రశ్నిస్తే అణచివేస్తున్నారు. 
 
ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం లేదు. దశాబ్దాల క్రితం ఒక్కో ఇటుక పేర్చి ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్యాన్ని మనముందే కూల్చివేస్తున్నారు. 
 
ఈ వ్యవహారశైలి నియంతృత్వ పాలన ప్రారంభానికి సూచన.
 
నలుగురైదుగురు ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ ప్రభుత్వం నడుస్తోంది. ఇద్దరు ముగ్గురు వ్యాపారుల కోసం ఇద్దరు వ్యక్తులు నియంతృత్వ పాలనకు పాల్పడుతున్నారు. నేను ఇలా ఎంత ఎక్కువగా ప్రశ్నిస్తే.. నాపై అంత ఎక్కువ దాడి జరుగుతుంది' అంటూ రాహుల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మళ్లీ 20 వేలుదాటిన కరోనా పాజిటివ్ కేసులు