Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి పి.ఏనంటూ బుగ్గ కారుతో హల్చల్... బోగస్ గన్ మేన్

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడినని నంటూ పలువురిని నమ్మించి పోలీసులకు చిక్కాడు నేరస్థుడు. సచివాలయంలో తనకున్న పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.70 లక్షల్ని వసూలు చేశాడు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు దర్

Webdunia
గురువారం, 10 మే 2018 (22:17 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడినని నంటూ  పలువురిని నమ్మించి పోలీసులకు చిక్కాడు నేరస్థుడు. సచివాలయంలో తనకున్న పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ.70 లక్షల్ని వసూలు చేశాడు.  ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు  దర్యాప్తు చేయడంతో అతడి బండారం బయటపడింది.
వరంగల్‌ మండీబజార్‌కు చెందిన మహ్మద్‌ ఖిఫాయత్‌ అలీ(29) ప్రైవేటు ఉద్యోగి. తెలంగాణ సీఎం సలహాదారుకు వ్యక్తిగత సహాయకుడినంటూ తన ఇంటి ముందు బోర్డు తగిలించుకున్నాడు. 
 
తన కారుకు ఎర్రబుగ్గ తగిలించుకొని స్థానికంగా హడావుడి చేసేవాడు. ఇఫ్తార్‌ విందుల పేరిట ప్రముఖుల్ని పిలిచి హంగామా చేసేవాడు. తన మిత్రుడుకు సఫారీ సూట్ వేసి గన్ మేన్ లా నటించమనేవాబు.  ఖిఫాయత్‌ అలీ హడావుడి చూసి అతడు నిజంగానే సచివాలయ ఉద్యోగి అని స్థానికులు నమ్మారు. ఈ క్రమంలో గత మూడేళ్లుగా ఉద్యోగాలిప్పిస్తానంటూ వరంగల్‌, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నంద్యాలకు చెందిన ఇరవై మంది నుంచి దాదాపు రూ.70 లక్షలు వసూలు చేశాడు. బాధితులెవరైనా గట్టిగా అడిగితే వారిని సచివాలయం వద్దకు రప్పించేవాడు. త్వరలోనే నియామక ఉత్తర్వులు ఇస్తారంటూ నమ్మించి పంపించేవాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను  ఆశ్రయిండంతో  దొరికిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments