Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రేమించినవాడిని నమ్మి వెళితే... అలా చేశాడు... 3వేల మంది అనుభవించారు...

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎవరిని నమ్మాలో... ఎవరిని నమ్మ కూడదో తెలియని పరిస్థితిలో మహిళలు ఉన్నారు. ఒకవైపు కన్నతండ్రి, మరోవైపు స్నేహితులు, ఇంకోవైపు ప్రేమించిన వ్యక్తి ఇలా ఎటువైపు నుంచి తమకు ఆపద వస్తుందో తెలియని పరిస్థితి మహిళలకు ఏర్పడుత

ప్రేమించినవాడిని నమ్మి వెళితే... అలా చేశాడు... 3వేల మంది అనుభవించారు...
, శుక్రవారం, 4 మే 2018 (14:54 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎవరిని నమ్మాలో... ఎవరిని నమ్మ కూడదో తెలియని పరిస్థితిలో మహిళలు ఉన్నారు. ఒకవైపు కన్నతండ్రి, మరోవైపు స్నేహితులు, ఇంకోవైపు ప్రేమించిన వ్యక్తి ఇలా ఎటువైపు నుంచి తమకు ఆపద వస్తుందో తెలియని పరిస్థితి మహిళలకు ఏర్పడుతోంది. అలాంటి సంఘటనే తూర్పుగోదావరిజిల్లాలో జరిగింది. 18 యేళ్ళకే ఎన్నో రకాల చిత్ర హింసలను అనుభవించింది ఆ యువతి. 
 
తూర్పుగోదావరి చెందిన సుబ్రమణ్యం కుమార్తె శైలజ ఒక యువకుడిని గాఢంగా ప్రేమించింది. ప్రేమికుడిని నమ్మి ఇంట్లో వారిని బెదిరించి బయటకు వెళ్ళిపోయింది. ప్రేమించిన యువకుడితో రెండునెలలు పాటు హాయిగా జీవించారు. ఆ తరువాత కష్టాలు మొదలయ్యాయి. ప్రియుడిని నమ్మి వచ్చినందుకు నరకయాతన చూపించాడు. ఇంట్లోనే తన స్నేహితులను తీసుకొచ్చి పడక సుఖం ఇవ్వమన్నాడు. ఇలా ఒకరిద్దరు కాదు నెలలో 20 మంది స్నేహితులతో గడపమన్నాడు. ప్రేమించిన వాడే ఇలా నరరూప రాక్షసుడిలా మారడంతో ఏం చేయాలో పాలుపోలేదు.
 
బలవంతంగా ఆమెను చిత్రహింసలకు గురిచేసి ఆ తర్వాత హైదరాబాదులో ఒక వ్యభిచార గృహానికి అమ్మేశాడు. తనను వదిలేయాలని ఎంత బ్రతిమాలినా వ్యభిచార గృహ నిర్వాహకులు ఒప్పుకోలేదు. చిత్రహింసలు పెట్టారు. సిగరెట్లతో ఒంటిపై కాల్చారు. బ్లేడ్లతో కోశారు. ఇలా వారం రోజులు చిత్రహింసలు పెట్టడంతో ఇక చేసేది లేక లొంగిపోయింది. దీంతో 3 వేల మంది తనను చిత్రహింసలు పెట్టి అనుభవించారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని మళ్ళీ ఇంటికి వచ్చేసింది. జరిగిన విషయాన్ని ఇంట్లో చెబితే తనను ఏమీ అనలేదు. ఇప్పుడు ఇంట్లోనే ఉన్నట్లు ఆమె ఆవేదనతో చెబుతోంది. తనకు జరిగిన అన్యాయం ఏ యువతికి జరగకూడదని, ప్రేమించిన వ్యక్తి మంచివాడా కాదా అన్నది చూసుకోవాలంటోంది శైలజ.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికల ప్రచారం అక్కర్లేదు.. ఇంట్లో కూర్చోండి.. "గాలి"కి సుప్రీంకోర్టు షాక్