Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాలికను కిడ్నాప్ చేసి గోడౌన్‌లో దాచి 15 మంది గ్యాంగ్ రేప్

వాళ్ళు మనషులు కాదు.. రాక్షసులు. ఓ మైనర్ బాలిక జీవితంతో ఆడుకున్నారు ఆ మృగాళ్ళు. కిడ్నాప్ చేసి 15 మంది సామూహిక అత్యాచారం చేశారు. చివరకు బాలికను ఒక ఇంట్లో దాచారు. మైనర్‌ను కాపాడాల్సిన నడి వయస్సు వ్యక్తి కూడా కామాంధుడిగా మారాడు. అప్పటికే స్పృహ తప్పి పడిప

Advertiesment
బాలికను కిడ్నాప్ చేసి గోడౌన్‌లో దాచి 15 మంది గ్యాంగ్ రేప్
, మంగళవారం, 1 మే 2018 (16:06 IST)
వాళ్ళు మనషులు కాదు.. రాక్షసులు. ఓ మైనర్ బాలిక జీవితంతో ఆడుకున్నారు ఆ మృగాళ్ళు. కిడ్నాప్ చేసి 15 మంది సామూహిక అత్యాచారం చేశారు. చివరకు బాలికను ఒక ఇంట్లో దాచారు. మైనర్‌ను కాపాడాల్సిన నడి వయస్సు వ్యక్తి కూడా కామాంధుడిగా మారాడు. అప్పటికే స్పృహ తప్పి పడిపోయిన చిన్నారిని కాటేశాడు.
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురంలో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. చాక్లెట్లు కొనుక్కుని ఇంటికి వెళుతున్న బాలికను ఆటోలో కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకులు అడవిలోకి తీసుకెళ్ళారు. ఇద్దరూ కలిసి ఆ బాలికపై అత్యాచారం చేసి ఆ తరువాత మరో ఐదుగురు స్నేహితులను పిలిచారు. వారు కూడా ఆ యువతిపై అత్యాచారం చేశారు. వారు మరో ఏడుగురికి సమాచారమిచ్చి పిలిపించుకుని గ్యాప్ రేప్‌కు పాల్పడ్డారు. 
 
14 మంది రాక్షసులు బాలికకు ఒక్కరోజులో నరకం చూపించారు. ఆ తరువాత ఒక గోడౌన్‌లో ఆ బాలికను దాచారు. ఆ గోడౌన్‌లో కాపలాదారుగా ఉన్న 60 యేళ్ళ వ్యక్తి కూడా ఆ బాలికపై అత్యాచారం చేశాడు.
 
బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోడౌన్‌లో నుంచి శబ్దం వస్తుండటాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడి నుంచి బాలిక కేకలు వినిపిస్తున్న విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. అత్యాచారానికి పాల్పడిన 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోడౌన్ వాచ్‌మెన్‌గా ఉన్న వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియాంక చోప్రా మంగళసూత్ర రూమర్స్.. అబ్బే.. సీక్రెట్ పెళ్లి చేసుకోను...?