ప్రియాంక చోప్రా మంగళసూత్ర రూమర్స్.. అబ్బే.. సీక్రెట్ పెళ్లి చేసుకోను...?
						
		
						
				
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా త్వరలో పెళ్లి కూతురు కాబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాకుండా తన చేతికి మంగళసూత్రంలా వున్న బ్రేస్‌లైట్‌ను ప్రియాంక చోప్రా ధరించింది. దీంతో ఆమె సీక్రెట్‌గా వివ
			
		          
	  
	
		
										
								
																	బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా త్వరలో పెళ్లి కూతురు కాబోతోందని జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేగాకుండా తన చేతికి మంగళసూత్రంలా వున్న బ్రేస్‌లైట్‌ను ప్రియాంక చోప్రా ధరించింది. దీంతో ఆమె సీక్రెట్‌గా వివాహం చేసుకుందని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది.
	
	
తన పెళ్లి గురించి మాట్లాడుకోవడం ఆపాలని కోరింది. దిష్టి తగలకుండా ఉండేందుకే తాను దీన్ని ధరించానని క్లారిటీ ఇచ్చింది. తాను సీక్రెట్‌గా పెళ్లి చేసుకోబోనని... అందరికీ చెప్పే చేసుకుంటానని తెలిపింది. 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	కాగా ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. క్వాంటికో, బేవాచ్‌లలో ఆమె తన సత్తా ఏంటో నిరూపించుంకుంది. అలాగే బాలీవుడ్‌లోనూ తన నటనకు మంచి మార్కులు వేసుకుంది.
తాజాగా సల్మాన్ సరసన ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నానని.. సల్మాన్ ఖాన్‌తో మళ్లీ నటించడం థ్రిల్లింగ్‌గా వుందని చెప్పుకొచ్చింది.