Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహం జరిగి 48 గంటలు గడవకముందే విషాదం.. నలుగురు మృతి

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (15:33 IST)
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం ముక్తాపురం గ్రామంలో పెళ్లి ఇంట విషాదం జరిగింది. నవ వరుడుతో పాటు తల్లిదండ్రులు విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృత్యువాత పడ్డారు. ఆ ఇంట వివాహం జరిగి 48 గంటలు కూడా గడవకముందే ఈ దారుణం జరగడంతో కన్నీటి పర్యంత అవుతున్నారు కుటుంబ సభ్యులు. 
 
వర్షం పడుతున్న కారణంగా బయట ఆరేసిన బట్టలు తీయడానికి వెళ్లిన ఈ నలుగురూ ఒకరి తరువాత ఒకరు షాక్‌కు గురై చనిపోయినట్టు తెలుస్తోంది. పెళ్లి పందిరి అలంకరణకు ఫోకస్ లైట్లను అమర్చారు. దానికి సపోర్టుగా ఉండేలా ఒక వైరును బిగించి ఇనుప రాడ్డుకు చుట్టారు. 
 
అదే రాడ్డుకు బట్టలు ఆరేయడానికి మరొక వైరును కూడా బిగించడంతో విద్యుత్ షార్ట్ సర్కూట్ అయింది. వర్షం పడటంతో బట్టలు తీసేందుకు వెళ్లిన వారు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. చనిపోయిన వారిలో పెళ్లి కొడుకు చిందం ప్రవీణ్, పెళ్లి కొడుకు తండ్రి చిందం సాయిలు, పెళ్ళి కొడుకు తల్లి చిందం గంగమ్మ.. పెళ్లి కొడుకు మేనత్త శామల గంగమ్మ నలుగురు చనిపోయారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments