Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యకు సిరిసిల్ల బంగారు చీర

వరుణ్
శుక్రవారం, 19 జనవరి 2024 (10:40 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల నేత కార్మికుడు హరిప్రసాద్‌ రూపొందించిన బంగారు చీరను భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ గురువారం పరిశీలించారు. దీన్ని ఈ నెల 26వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసి, శ్రీరాముడి పాదాల చెంతకు చేర్చేలా చూస్తానని తెలిపారు. శ్రీరాముడి చిత్రంతోపాటు రామాయణ ఇతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను ఈ చీరలో నేశామని, 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి ఉపయోగించి 20 రోజుల్లో తయారు చేశామని హరిప్రసాద్‌ తెలిపారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గౌరవించి సాదరంగా ఆహ్వానించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివాసీలను అవమానపరిస్తే బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. 
 
అయోధ్య గర్భగుడిలో ఐదేళ్ళ బాలుడిగా రామయ్య - ఇదిగో ఫోటో... 
 
అయోధ్య గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరాడు. నిలబడిన రూపంలో రామ్ లల్లా నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఐదేళ్ల బాలుడుగా రాముడు కనిపించాడు. అయితే, విగ్రహం ముఖం కనిపించకుండా పరదాతో కప్పేశారు. ఈ రామ్ లల్లా విగ్రహం తొలి ఫోటోను తాజాగా విడుదల చేశారు.
 
ఈ నెల 22వ తేదీన అయోధ్య ప్రాణప్రతిష్ట ఘట్టం జరుగనుంది. ఈ ఘట్టానికి ముందు గురువారం కీలక తంతును పూర్తి చేశారు. ప్రత్యేక పూజలతో మధ్యాహ్న సమయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయం గర్భగుడిలో పెట్టారు. 22వ తేదీన జరిగే ప్రాణప్రతిష్ట వరకు బాల రాముడు ప్రత్యేక పూజలు అందుకుంటాడు. 
 
కాగా, గర్భగుడిలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం తొలి ఫోటో బయటకు వచ్చింది. విగ్రహం ముఖ్యాన్ని వస్త్రంతో కప్పేసి ఉన్నప్పటికీ మిగితా రూపం కనిపించింది. నిలబడిన ఆకారంలో ఐదేళ్ల పిల్లవాడిగా అయోధ్య రాముడు కనిపించాడు. నల్లరాతితో తయారు చేసిన ఈ విగ్రహాన్ని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కాడు. 
 
కాగా, ఈ నెల 22వ తేదీన జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మరుసటి రోజు అంటే 23వ తేదీ నుంచి భక్తులు అయోధ్య రామయ్యను దర్శనం చేసుకోవచ్చు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 11 వేల మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించిన విషయం తెల్సిందే. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. వారిలో క్రికెట్ లెజండ్ సచిన్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ తదితర సినీ సెలెబ్రిటీలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments