Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

train

వరుణ్

, గురువారం, 18 జనవరి 2024 (12:40 IST)
ఈ నెల 22వ తేదీన అయోధ్య నగరంలో రామ్ లాల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా అయోధ్యకు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఇందులోభాగంగా, రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపేలా ప్లాన్ చేసింది. 
 
మున్ముందు అయోధ్యకు రద్దీ పెరగనున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేలా ప్రణాళికలు రూపొందింస్తుంది. తెలంగాణలోని సికింద్రాబాద్‌, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి అయోధ్య స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. సికింద్రాబాద్‌ - అయోధ్య ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. 
 
విజయవాడ - అయోధ్య  రైళ్లు.. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
 
ఈ నెల 29 నుంచి.. సికింద్రాబాద్‌ - అయోధ్య ప్రత్యేక రైళ్లు జనవరి 29, 31 ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరుతాయి. అయోధ్య నుంచి సికింద్రాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతాయి.
 
కాజీపేట నుంచి అయోధ్యకు జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరుతాయి. ఈ రైళ్లు అయోధ్య నుంచి తిరిగి కాజీపేట వస్తాయి.
 
విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుంచి జనవరి నుంచి 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న సామర్లకోట నుంచి ఫిబ్రవరి 11న ప్రత్యేక రైళ్లు అయోధ్యకు పయనమవుతాయి. అయోధ్య నుంచి తిరిగి ఆయాచోట్లకు వస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒంటెపై స్వారీ చేసిన వరుడు.. కేసు పెట్టిన పోలీసులు.. ఎక్కడ?