Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయ్యప్ప భక్తులకు శుభవార్త - సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

train
, మంగళవారం, 21 నవంబరు 2023 (09:40 IST)
తెలుగు రాష్ట్రాల్లోని అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ళను నడుపనున్నట్టు తెలిపింది. మొత్తం 22 స్పెషల్ ట్రైన్స్‌ను నడుపనున్నట్టు తెలిపింది. ఇవి ఈ నెల 26వ తేదీన, డిసెంబరు 3 తేదీల్లో సికింద్రాబాద్ - కొల్లం ప్రాంతాల మధ్య ప్రత్యేక రైలును నడుపుతారు. అలాగే, ఈ నెల 28వ తేదీ, డిసెంబరు 5 తేదీల్లో కొల్లాం - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైలును నడుపుతారు. 
 
ఈ నెల 26వ, డిసెంబరు 3 తేదీల్లో నర్సాపూర్ - కొట్టాయం, ఈ నెల 27, డిసెంబరు 4వ తేదీల్ల కొట్టాయం - నర్సాపూర్, ఈ నెల 22, 29వ, డిసెంబరు 6వ తేదీల్లో కాచిగూడ - కొల్లం, ఈ నెల 24, డిసెంబరు 1, 8 తేదీల్లో కొల్లం - కాచిగూడ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు తెలిపింది. 
 
ఇకపోతే, ఈ నెల 23, 30వ తేదీనల్లో కాకినాడ - కొట్టాయం, ఈ నెల 25, డిసెంబరు 6వ తేదీన కొట్టాయం - కాకినాడు, ఈ నెల 24, డిసెంబరు ఒకటో తేదీన సికింద్రాబాద్ - కొల్లం, ఈ నెల 25, డిసెంబరు 2వ తేదీల్లో కొల్లం - సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలతో పాటు స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయని, ఈ రైళ్లలో ప్రయాణం చేయదలచిన ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు రిజర్వేషన్ సౌలభ్యం కూడా కల్పించినట్టు పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్పత్రిలో చేరిన డీఎండీకే అధినేత విజయకాంత్.. ఎందుకు?