Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయోధ్య గర్భగుడిలో ఐదేళ్ళ బాలుడిగా రామయ్య - ఇదిగో ఫోటో...

Advertiesment
ram lalla idol

వరుణ్

, శుక్రవారం, 19 జనవరి 2024 (08:32 IST)
అయోధ్య గర్భగుడిలో బాల రాముడు కొలువుదీరాడు. నిలబడిన రూపంలో రామ్ లల్లా నల్లరాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఐదేళ్ల బాలుడుగా రాముడు కనిపించాడు. అయితే, విగ్రహం ముఖం కనిపించకుండా పరదాతో కప్పేశారు. ఈ రామ్ లల్లా విగ్రహం తొలి ఫోటోను తాజాగా విడుదల చేశారు.
 
ఈ నెల 22వ తేదీన అయోధ్య ప్రాణప్రతిష్ట ఘట్టం జరుగనుంది. ఈ ఘట్టానికి ముందు గురువారం కీలక తంతును పూర్తి చేశారు. ప్రత్యేక పూజలతో మధ్యాహ్న సమయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయం గర్భగుడిలో పెట్టారు. 22వ తేదీన జరిగే ప్రాణప్రతిష్ట వరకు బాల రాముడు ప్రత్యేక పూజలు అందుకుంటాడు. 
 
కాగా, గర్భగుడిలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహం తొలి ఫోటో బయటకు వచ్చింది. విగ్రహం ముఖ్యాన్ని వస్త్రంతో కప్పేసి ఉన్నప్పటికీ మిగితా రూపం కనిపించింది. నిలబడిన ఆకారంలో ఐదేళ్ల పిల్లవాడిగా అయోధ్య రాముడు కనిపించాడు. నల్లరాతితో తయారు చేసిన ఈ విగ్రహాన్ని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కాడు. 
 
కాగా, ఈ నెల 22వ తేదీన జరిగే ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మరుసటి రోజు అంటే 23వ తేదీ నుంచి భక్తులు అయోధ్య రామయ్యను దర్శనం చేసుకోవచ్చు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి 11 వేల మంది అతిథులను ఆలయ ట్రస్ట్ ఆహ్వానించిన విషయం తెల్సిందే. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. వారిలో క్రికెట్ లెజండ్ సచిన్, విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ తదితర సినీ సెలెబ్రిటీలు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొబైల్ AI యుగంలోకి ప్రవేశించిన శాంసంగ్, భారతదేశంలో గెలాక్సీ ఎస్ 24 సిరీస్‌ విడుదల