సీఎం కేసీఆర్‌కు తేరుకోలేని షాకిచ్చిన కోనేరు కోనప్ప... రేపు కాంగ్రెస్‌లో చేరిక

ఠాగూర్
బుధవారం, 13 మార్చి 2024 (15:43 IST)
భారత రాష్ట్ర సమితికి చెందిన కీలక నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కొనేరు కోనప్ప షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. భారాసకు, జిల్లా అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. పైగా, గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మంత్రి సీతక్క సమక్షంలో ఆయ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. కోనప్పతో పాటు ఆయన కుమారుడు, పార్టీ జెడ్పీ ఇన్‌చార్జి చైర్మన్, కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పినట్టు సమాచారం. కోనప్ప అనుచరులు పెద్ద సంఖ్యలో పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కోనప్ప జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఇటీవల కోనప్ప తన సోదరుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతానే ప్రచారం మొదలైంది. 
 
తాజాగా ఆయన తన జిల్లా భారాస అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది. బీఎస్పీతో పొత్తును జీర్ణించుకోలేకే కోనప్ప పార్టీని వీడుతున్నారని ప్రచారం సాగుతుంది. కోనప్పతో పాటు జిల్లాలోని ద్వితీయ శ్రేణి నేతలు కూడా అనేక మంది ఆ పార్టీలో చేరుతాని ప్రచారం సాగుతుంది. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న తరుణంలో జిల్లాలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందిన కోనేరు కోనప్ప.. భారాసను వీడటం ఆ పార్టీకి గట్టి దెబ్బవంటిదని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments