వినాయక చతుర్థి స్పెషల్- పాలతాలికలు ఎలా చేయాలంటే?

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (18:20 IST)
వినాయక చతుర్థి రోజున ఉండ్రాళ్ళు, పాలతాలికలు, పండ్లు వంటివి గణేశునికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాంటి నైవేద్యాల్లో ఒకటైన పాలతాలికలను ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు
‌పాలు -  ఒకటిన్నర లీటరు. 
నీళ్లు - ఒక లీటరు. 
పంచదార - పావు కేజీ
‌బెల్లం - పావుకేజి. 
యాలకుల పొడి - ఒక టీ స్పూను. 
నెయ్యి - కొద్దిగా. 
‌సగ్గు బియ్యం - ‌వందగ్రాములు. 
బియ్యపిండి - వందగ్రాములు. 
మైదాపిండి - రెండు టీ స్పూన్లు 
 
తయారీ విధానం: 
ముందుగా పాలను నీటిని మరిగించాలి. అందులో సగ్గుబియ్యాని కూడా ఉడికించుకోవాలి. ఈలోపు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదారతో పిండిలా కలుపుకోవాలి. పిండిని తాలికల్లా చేసుకుని మరుగుతున్న పాలలో వేసి ఉడికించాలి. ఈ జంతికలు అతుక్కోకుండా కలుపుతూ వుండాలి. తాలికలు ఉడికేలోపుగా బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, యాలకుల పొడిని వేసి కలపాలి. అంతే పాల తాలికలు సిద్ధమైనట్లే. ఈ వంటకాన్ని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ONGC: కోనసీమ జిల్లా... ఓఎన్‌జీసీ బావిలో తగ్గని మంటలు.. నాలుగో రోజు కూడా?

కుమారుడు హఠాన్మరణం... సంపాదనలో 75 శాతం పేదలకు : వేదాంత చైర్మన్

కేతిరెడ్డి భాష మార్చుకోకపోతే పట్టుకుని తంతా.. పౌరుషం లేని నా కొ... లు కేతిరెడ్డి బ్రదర్స్ : జేసీ ప్రభాకర్ ఫైర్ (Video)

సంక్రాంతి పండగపూట ఆంధ్రాలో ఆర్టీసీ సమ్మె సైరన్

రఫ్పా రఫ్పా నినాదాలు... జంతుబలి, రక్తాభిషేకాలు చేసిన వారితో జగన్ భేటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty: పండగకు .వినోదాన్ని పంచే అల్లుడు వస్తున్నాడు : నవీన్ పోలిశెట్టి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్- ఆన్‌లైన్‌లో కరాటే టు సామురాయ్ కొత్త వీడియో

విజయ్ 'జన నాయగన్' మూవీ రిలీజ్ వాయిదా

Maruthi: రాజా సాబ్ కు మొదటి రోజు వంద కోట్లకు పైగా వస్తాయని ఆశిస్తున్నాం - టీజీ విశ్వప్రసాద్

Anil Ravipudi: విమర్శలను తట్టుకుని ఎంటర్టైన్మెంట్ తో ఆదరణ పొందడం కష్టమైన పని : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments