గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనితో మనం రకరకాల వంటలు చేసుకోవచ్చు. సాయంత్రం సమయంలో పిల్లలు వెరైటీ స్నాక్స్ కావాలని గొడవ పెడుతుంటారు. పిల్లల ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలను మనం చేసిపెట్టడం వలన వారి ఆరోగ్యాన్ని కాపాడినవారమవుతాము. మరి గుమ్మడికాయతో బ్రెడ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు :
మైదాపిండి- రెండున్నర కప్పులు,
బేకింగ్ పౌడర్- ఒక టీస్పూను
దాల్చినచెక్కపొడి- అర టీస్పూను,
అల్లం పేస్టు- పావు టీస్పూను
జాజికాయ పొడి- అర టీస్పూను,
గుమ్మడి కాయ గుజ్జు- ఒక కప్పు,
అరటిపండు గుజ్జు- ఒక కప్పు,
పంచదార- అరకప్పు,
తేనె- అరకప్పు,
ఆవనూనె- పావుకప్పు,
గుడ్లు- రెండు,
వాల్ నట్- ముప్పావుకప్పు,
ఉప్పు- తగినంత.
తయారుచేసేవిధానం :
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, దాల్చినచెక్క పొడి, జాజికాయ పొడి ఒకదాని తరువాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్టు, అరటిపండిు గుజ్జు, గుమ్మడి కాయ గుద్దు, పంచదార, తేనె, ఆవనూనె, గుడ్లు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ మేకర్ బౌల్‌లో ఆ మిశ్రమం మొత్తాన్ని వేసుకుని దానిపై వాల్‌నట్ తురుముని వేసుకుని నలబై నిముషాల పాటు ఉడకనివ్వాలి. చల్లారిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గుమ్మడికాయ బ్రెడ్ రెడీ.