ప్రియతమా నా గుండెల్లో నీ ప్రేమతో గుబులు పుట్టింటింది..!

బుధవారం, 24 ఏప్రియల్ 2019 (12:30 IST)
ప్రియతమా నా గుండెల్లో నీ ప్రేమతో గుబులు పుట్టింది..
తెల్లని నా మనసుపై రంగుల హరివిల్లు తొడిగింది..
నా మనసు చెబుతోంది.. నా లోని చిరునవ్వు నీవు అని..
 
కాలమంతా రాలిపోతే.. కలల చట్రం వీడిపోయి..
పూల రంగు వెలిగిపోయి.. పుణ్యకాలమొచ్చినాక..
వెలుగు నీడలు కలిసే చోట.. కొత్త పాతగ మారే వేళ.. అగ్ని పడక మీద ఒంటి నిదుర..
 
మొద్దుపోయిన కాలం..
ముద్దులతో చిగురించనీ..
వలపు మల్లెలు మూటగట్టి..
రాత్రి సరిహద్దు దాటితే.. ఊహల లోకం..
 
వదిలి వెళ్ళిన కాలాన్ని..
విడిచి వెళ్ళిన పాదాన్ని..
కరిగిపోయిన కలల్ని..
కన్నీటిని మిగిల్చిన ఆశల్ని.. 
తలుచుకుంటూ ఎదురు వచ్చే రేపుని వెళ్లిపోనీయకు

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం చికెన్ రైస్..?