Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొబ్బరి రైస్ కేక్..?

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (11:42 IST)
కావలసిన పదార్థాలు:
బియ్యం - 2 కప్పులు
చక్కెర - ఒకటిన్నర కప్పు
కొబ్బరి పాలు - పావు లీటరు
కొబ్బరి తురుము - 1 కప్పు
మంచినీళ్లు - రెండున్నర కప్పులు
 
తయారుచేసే విధానం:
ముందుగా బియ్యం బాగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు వార్చి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. ఆపై బాణలిలో కొబ్బరిపాలు, చక్కెర వేసి ఉడికించాలి. చక్కెర బాగా కరిగేవరకు ఉంచి అనంతరం స్టవ్ కట్టేయాలి. దాదాపు 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. కరిగిన పంచదారను ఉడికించి ఉంచిన అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. 
 
ఆ తరువాత అన్నం మిశ్రమంలో కొబ్బరి తురుము వేసి కలిపి కేక్ తయారు చేసే పాత్రని తీసుకుని దాని అడుగున నెయ్యి రాయాలి. అందులో స్పూన్ కొబ్బరి తురుము, స్పూన్ చక్కెర చల్లి.. దానిమీద అన్నం మిశ్రమాన్ని వేసి మౌల్డ్‌ను ఓవెన్ పెట్టాలి. 180 డిగ్రీల వేడి దగ్గర 45 నిమిషాల పాటు బేక్ చేయాలి. ఈ లోపు కొబ్బరి తురుమును, చక్కెరను బాణలిలో వేసి కాసేపు వేయించాలి. తరువాత ఓవెన్ లోంచి కేకు తీసి.. వేయించిన కొబ్బరి తురుము, చక్కెర మిశ్రమాన్ని చల్లాలి. అంతే... కొబ్బరి రైస్ కేక్ రెడీ.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments