నోరు చేదుగా ఉందా.. అయితే ఇలా చేయండి..?

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (10:42 IST)
వేసవికాలంలో చల్లదనం కోసం ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదని చాలామంది ఆలోచిస్తుంటారు. మరికొందరైతే ఏం తీసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. శరీరానికి చల్లదనంతో పాటు చర్మ సంరక్షణను అందించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు చాలా అధికంగా ఉన్నాయి. వేసవి కాలంలో కీరదోసతో ఉపశమనం పొందడమే కాదు ఆరోగ్యాన్నీ రెట్టింపు చేయొచ్చు.
 
కీరదోస తినడం వలన శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. దాంతో శరీరంలోని చెడు మలినాలు, విష పదార్థాలు బయటకు పోతాయి. ముఖ్యంగా కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిల్లో కొద్దిగా ఉప్పు, కారం వేసి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా తరచు తింటుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతోపాటు చర్మం ముడతలన్ని నివారిస్తుంది.
 
కీరదోసలోని విటమిన్ ఎ, బి, సి, మెగ్నిషియం, పొటాషియం, సిలికాన్ వంటి మినరల్స్ అధిక మోతాదులో ఉంటాయి. కీరదోస ముక్కలను కంటిపై పెట్టుకుంటే.. కంటి అలసట, ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. కీరదోస శరీర వేడిని తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. ఎండ ప్రభావం కారణంగా చర్మం కందిపోతుంది. అలాంటప్పుడు కీరదోస ముక్కలతో చర్మం మీద రుద్దుకుంటే సాంత్వన లభిస్తుంది. 
 
తరచు కీరదోస తింటుంటే నోటి దుర్వాసన తగ్గుతుంది. కీరదోసతో రోజూ తింటే.. అధిక రక్తపీడనం, అల్ప రక్తపీడనం వంటి సమస్యలు తగ్గిపోతాయి. దీనిలోని ఆమ్లాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. సాధారణంగా జ్వరంగా ఉన్నప్పుడు నోరు చేదుగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. కీరదోస ముక్కలో తింటే ఫలితం ఉంటుంది. దాంతో శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లోన్లీ ప్లానెట్ 2026, బెస్ట్ ఇన్ ట్రావెల్ టాప్ గ్లోబల్ ఎక్సపీరియెన్సెస్: ఓల్డ్ దుబాయ్‌లోని సాంస్కృతిక ఆహార పర్యటనలు

పట్టపగలు నడిరోడ్డుపై మాజీ ప్రియురాలిని పొడిచి చంపేసిన వ్యక్తి.. ఆపై గొంతుకోసుకుని?

నాగుల చవితి వేళ అద్భుతం.. శివలింగానికి ఇరువైపులా నాగుపాములు (video)

వామ్మో మొంథా తుఫాన్, ఏపీలోనే తీరం దాటుతుందట, రెడ్ ఎలర్ట్

Kurnool Bus Accident: డీఎన్ఏ ప్రొఫైలింగ్ 48 గంటలు పడుతుంది.. అక్టోబర్ 27 నాటికి పూర్తి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana Miheeka: రానా-మిహీకా దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారా?

Rashmika Mandanna: ఫేషియల్ ట్రీట్మెంట్ చేసుకున్న రష్మిక మందన్న

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments