Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొబ్బర్లతో ఆరోగ్య ప్రయోజనాలు...

Webdunia
బుధవారం, 13 మార్చి 2019 (22:06 IST)
మనకు ప్రకృతిలో సహజసిద్దంగా లభించే అలసందను బొబ్బర్లు అని కూడా అంటారు. అలసందలు రుచికరంగా మరియు మంచి ఫ్లేవర్‌ను కలిగి ఉంటాయి. అలసందల్లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ కలిగి ఉండి మన శరీరంలో వివిధ రకాల జీవక్రియలకు సహాయపడుతాయి. అలసందలను తినడానికి గల ముఖ్య ఆరోగ్య కారణాలు ఏమిటో చూద్దాం.
 
1. అలసందలు తక్కువ క్యాలరీలు మరియు తక్కువ ఫ్యాట్ కలిగి ఉటుంది. బరువు తగ్గించడంలో మంచి ఆహారంగా సహాయపడుతుంది. అలసందల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . అందుకే బరువు తగ్గించడంలో ఇది ప్రధాన పాత్రను పోషిస్తుంది. వీటిని తినడం వల్ల మీ పొట్టనిండిన అనుభూతి కలుగుతుంది.
 
2. మధుమేహంతో బాధపడే వారికి లోగ్లిజమిక్ ఇండెక్స్ కలిగిన అలసందలు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నార్మల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
 
3. అలసందల్లో యాంటీఆక్సిడెంట్స్, మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటుంది. అందుకే కొన్ని రకాల వ్యాధులను నివారించడంలో, అలాగే  వ్యాధులు వ్యాప్తి చెందకుండా సహాయపడుతుంది. శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికరటాక్సిన్స్‌ను నివారిస్తుంది మరియు ఆక్సిజన్ ఫ్రీరాడికల్స్‌ను శరీరం నుండి తొలగిస్తుంది.
 
4. అలసందలు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తుంది మరియు హార్ట్ సంబంధిత వైరస్ నుండి మనల్ని రక్షిస్తుంది. ఇందులో ఉండే ఫ్లెవనాయిడ్స్, మినిరల్స్ పొటాషియం మరియు మెగ్నిషయం గుండె ఆరోగ్యానికి  సహాయపడుతాయి.
 
5. అలసందల్లో అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్ల పొట్టలో అనుకూల ప్రభావంను కలిగి ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. మలబద్దకాన్ని నివారించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
 
6. అలసందల్లో ఉండే అధిక ప్రోటీన్ కంటెంట్ చర్మంను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ ఎ, సిలు ఫ్రీరాడికల్స్ నుండి చర్మానికి హాని జరగకుండా, చర్మ కణాలను రక్షిస్తాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments