Publish Date: Mon, 11 Mar 2019 (11:04 IST)
Updated Date: Mon, 11 Mar 2019 (17:09 IST)
కావలసిన పదార్థాలు:
కార్న్‌ఫ్లోర్ - 2 స్పూన్స్
చక్కెర - 1 కప్పు
పాలు - 2 కప్పులు
గుడ్లు - 2
వెనిల్లా ఎసెన్స్ - 4 చుక్కలు
బొప్పాయి గుజ్జు - 4 కప్పులు
తయారీ విధానం:
ముందుగా బొప్పాయి గుజ్జు, చక్కెర, కార్న్‌ఫోర్ల్ గిన్నెలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పాలు పోస్తూ కలపాలి. ఇప్పుడు స్టవ్‌పై ఉంచి కలుపుతూ గరిటెకు అంటుకునేవరకు ఉడికించి చల్లార్చాలి. ఆ తరువాత గుడ్డు తెల్లసొన, వెనిల్లా వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. కాస్త గట్టిపడిన తరువాత ఫ్రిజ్ నుండి బయటకు తీసి బొప్పాయి గుజ్జు కలపాలి. మరో గంటపాటు ఫ్రిజ్‌లో ఉంచి బయటకు తీసి కలిపి బౌల్స్‌లో వేసుకుని తింటే చల్లచల్లగా ఎంతో బాగుంటుంది.