Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ నవమి ఎప్పుడు చేయాలి?

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (23:38 IST)
రాముడు వసంత రుతువు, చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తం అంటే మధ్యాహ్నం సరిగ్గా 12:00 గంటలకు త్రేతాయుగంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు మానవుడిగా శ్రీరాముడిగా అవతరించిన రోజుని హిందువులు పండుగగా జరుపుకుంటారు. 
 
చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడి వివాహం, పదునాలుగు సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయిన రోజు కూడా చైత్ర శుద్ధ నవమి.
 
శ్రీరామ నవమి రోజున ప్రతి శ్రీరాముని దేవాలయాలలో సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించి సాయంత్రం వీధులలో ఊరేగిస్తారు. మహారాష్ట్రలో చైత్ర నవరాత్రి వసంతోత్సవం తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తారు. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలలలో వస్తుంది. ఆ రోజు ఉదయాన్నే సూర్యుడికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభం అవుతుంది.
 
శ్రీరాముడు మధ్యాహ్నం 12:00 గంటలకు పుట్టాడు కాబట్టి మధ్యాహ్న సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామనవమిని అత్యంత వైభవంగా జరుపుతారు. భక్తులు సాయంత్రం అందంగా అలంకరించిన రథంపై శ్రీరాముని ఊరేగిస్తారు. అందుచేత శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేస్తే శ్రీరామానుగ్రహం పొందిన వారమవుతాం. అంతేగాకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

తర్వాతి కథనం
Show comments