ఆలయంలో కుంకుమ, విభూతి ఇస్తే ఏం చేస్తున్నారు?

మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (21:48 IST)
దేవాలయాలకు వెళ్తున్నారా? దైవ దర్శనానికి అనంతరం.. కుంకుమ, విభూతి ప్రసాదాలను ఆలయ గోడలపై లేదా ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారా..? ఆలయాల్లో ఇచ్చే కుంకుమ, విభూతి ప్రసాదాలను నుదుట ధరించాక.. గోడలపై లేదా ఆలయంలోని ఏదైనా ప్రదేశంలో చల్లటం చేయకూడదని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
ఆలయంలో విభూతి, కుంకుమ ప్రసాదాలు ఇవ్వడం.. మనతో పాటు మనచుట్టూ ఉండే వారిని రక్షించుటకేనని, అలాంటి మహిమాన్వితమైన ప్రసాదాలను ఆలయాల్లోనే వదిలి వెళ్లడం.. దైవ అనుగ్రహాన్ని తిరస్కరించినట్లవుతుందని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. 
 
కుటుంబం మొత్తం ఆలయానికి వెళ్లినా.. అక్కడ ఇచ్చే ప్రసాదాలను ఇంటికి తీసుకురావడం పూజామండపంలో ఉంచి రోజూ నుదుటన ధరించడం ద్వారా శుభఫలితములు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పరీక్షలొచ్చేశాయ్... పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ శ్లోకం