జనవరి 12 నుంచి థాయ్‌లాండ్ ఓపెన్.. ఇంగ్లండ్‌కు వెళ్తున్న పీవీ సింధు?

Webdunia
శనివారం, 2 జనవరి 2021 (10:44 IST)
జనవరి 12 నుంచి జరుగనున్న థాయ్‌లాండ్‌ ఓపెన్‌తో సింధు మళ్లీ అంతర్జాతీయ టోర్నీ బరిలో దిగనున్నారు. థాయిలాండ్‌ ఓపెన్‌కు ఆమె లండన్‌ నుంచే వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ.. భారత్‌లో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇంగ్లండ్ వెళ్లి సాధన చేయాలనుకోవడం తాను తీసుకున్న ఉత్తమ నిర్ణయాల్లో ఒకటని తెలిపింది. 
 
ఇక్కడ చలి మరీ ఎక్కువగా ఉండటం ఇబ్బందే కానీ.. ఎంతో తీవ్రతతో సాగిన శిక్షణ కార్యక్రమాలను బాగా ఆస్వాదించా. ఇప్పట్నుంచి వరుసగా టోర్నీలు ఆడతామని ఆశిస్తున్నా. సురక్షిత స్థితిలో ఉంటూనే.. కష్టపడుతూ, ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ముందుకు సాగాలి. కరోనా వైరస్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పారు. 
 
లండన్‌లో కొత్త సంవత్సరం వేడుకలలో పాల్గొన్న ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధు మరిన్ని విషయాలను కూడా పంచుకున్నారు. తన సాధన బాగా సాగుతోందని, టైటిల్ సాధించడంపైనే దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. సింధు చివరిసారిగా మార్చి 11 నుంచి 15 వరకు జరిగిన ఆల్‌ ఇంగ్లండ్‌ టోర్నీలో తలపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న సింధుకు థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో అనుకూలమైన 'డ్రా' ఎదురైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Yadagirigutta: రూ.1.90 లక్షలు లంచం డిమాండ్ చేసి యాదగిరి గుట్ట ఈఈ చిక్కాడు

సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్‌ను వెంటనే ప్రారంభించాలి.. పవన్ కల్యాణ్

ISRO: సీఎంఎస్-03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో

Millionaire: యూఏఈ భారతీయుడి జీవితంలో అద్భుతం.. తల్లి వల్ల రూ.240 కోట్ల జాక్ పాట్.. ఎలా?

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందని కారుతో గుద్ది చంపేసిన కపుల్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rahul Ravindran: ఓజీలో ఆయన చెప్పగానే నటించా, హను రాఘవపూడి పిలిస్తే వెళ్తా : రాహుల్ రవీంద్రన్

Yash: రాకింగ్ స్టార్ య‌ష్ మూవీ టాక్సిక్: విడుదలపై రూమ‌ర్స్‌కి చెక్

Avika Gor : అవిక గోర్ నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ

Samantha: ది గాళ్ ఫ్రెండ్ చిత్రానికి సమంత ను కాదని రష్మిక ను ఎందుకు తీసుకున్నారో తెలుసా...

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

తర్వాతి కథనం
Show comments