Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ నుంచి పీవీ సింధు అవుట్

థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ నుంచి పీవీ సింధు అవుట్
, బుధవారం, 2 సెప్టెంబరు 2020 (15:37 IST)
థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నమెంట్‌ నుంచి భారత స్టార్ షట్లర్‌ పీవీ సింధు వైదొలగనుంది. అక్టోబర్‌లో డెన్మార్క్‌లో జరుగనున్న ఈ టోర్నీ నుంచి ఆమె తప్పుకోనుంది. వ్యక్తిగత కారణాలతోనే సింధు ఈ టోర్నీకి దూరమవుతుందని ఆమె తండ్రి పీవీ రమణ మీడియాకు వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం డెన్మార్క్‌లోని ఆర్హాస్ నగరంలో అక్టోబర్ 3 నుంచి 11 వరకు థామస్‌ అండ్‌ ఉబెర్‌ కప్‌ టోర్నీ జరుగనుంది.
 
రాబోయే మరో రెండు టోర్నమెంట్‌లకు కూడా సింధు తన ఎంట్రీలను పంపనుందని, అయితే అప్పటి పరిస్థితులను బట్టి ఆ టోర్నీల్లో ఆడాలా, వద్దా అనే విషయాన్ని నిర్ణయించుకోనున్నదని రమణ తెలిపారు. అయితే డెన్మార్క్‌లోని ఓడెన్స్‌లో జరుగనున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సూపర్ 750 టూర్ ఇవెంట్లలో సింధు పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న రైనా.. నేడు భజ్జీ ఔట్ : సీఎస్కేకు దెబ్బమీద దెబ్బ!