2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొంది ప్రపంచం దృష్టిని ఆకర్షించింది పీవీ సింధు. ఈ ఘనత సాధించిన ఏకైక భారత షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పింది. అయితే సోషల్ మీడియా వేదికగా ఐ రిటైర్ అంటూ పీవీ సింధూ పెట్టిన పోస్టు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. పాతికేళ్లకే రిటైర్మెంట్ ఏంటని అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
వాస్తవానికి పీవీ సింధూ వ్యంగంగా ట్వీట్ చేసింది. నా ప్రకటన మీకు కొంత షాక్‌ని ఇవ్వొచ్చు అని చెబుతూనే.. చివరి వరకు చదివితే పరిస్థితిని మీరే అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాంటూ పోస్టు పెట్టింది. విశ్రాంతి లేని ఆటకు ఇక ముగింపు పలకాలని నిర్ణయించుకున్నానంటూనే.. నెగిటివిటీ నుంచి, భయం నుంచి, అనిశ్చితి నుంచి రిటైర్ అవబోతున్నానని రాసుకొచ్చింది. రిటైర్ అవబోతున్నానంటూ ఆరంభంలో రాసిన మాటలు అందరినీ షాక్‌కి గురిచేశాయి. చిన్న వయస్సులో… కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే రిటైర్మెంట్ ఏంటి? అని నెటిజన్లు నమ్మలేకపోయారు.
సింధూ పోస్టు చివర్లో ఆమె అభిప్రాయం ఏంటో తెలిశాక.. హమ్మయ్య పివి సింధు రిటైర్ అవడం లేదులే అభిమానులు ఊపిరి పీల్చుకుంటే… కొందరు నెటిజెన్స్ మాత్రం విమర్శలు చేస్తున్నారు. మరికొంత మంది తమదైన స్టైల్లో మీమ్స్‌తో ఆమెపై అంతే వ్యంగ్యంగా పోస్టులు పెట్టారు. మొత్తానికి పీవీ సింధు ట్వీట్… అభిమానుల్ని తికమకకి గురిచేసింది. సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగేలా చేసింది.