Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత టెస్ట్ జట్టులో 'యార్కర్' నటరాజన్‌కు చోటు

Webdunia
శుక్రవారం, 1 జనవరి 2021 (16:44 IST)
భారత టెస్ట్ క్రికెట్ జట్టులోకి యార్కర్ నటరాజన్‌కు చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో బౌలర్ ఉమేష్ యాదవ్ గాయపడ్డారు. ఇపుడు అతని స్థానంలో తమిళనాడు కుర్రోడు నటరాజన్‌కు చోటు కల్పించారు. ఇప్పటికే ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయంతో సిరీస్ మొత్తానికి దూరం కాగా, ఇప్పుడు ఉమేశ్ కూడా షమీ బాటలోనే నడిచాడు.
 
కాగా, ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఇందులో ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్‌లు ముగిశాయి.  మరో రెండు టెస్టులు ఆడాల్సి ఉండగా, ఉమేశ్ స్థానంలో తమిళనాడు లెఫ్టార్మ్ సీమర్ టి.నటరాజన్‌ను జట్టులోకి ఎంపిక చేశారు. ఇటీవలే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నటరాజన్ అమోఘంగా రాణించాడు.
 
ఇక సిరీస్‌లో ఇప్పటివరకు 2 టెస్టులు జరగ్గా ఇరుజట్లు 1-1తో సమవుజ్జీగా ఉన్నాయి. మిగిలిన రెండు టెస్టుల కోసం జట్టును ఎంపిక చేసేందుకు ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ సమావేశమైంది. షమీ స్థానంలో ఇప్పటికే ముంబయి పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను జట్టులో సెలెక్టర్లు చోటు కల్పించారు. 
 
తాజాగా ఉమేశ్ స్థానాన్ని నటరాజన్‌తో భర్తీ చేయాలని నిర్ణయించారు. అటు, 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న స్టార్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ జట్టుతో కలిశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు ఈ నెల 7 నుంచి సిడ్నీలో జరగనుంది. 

జట్టు సభ్యులు ... 
 
అజింక్యా రహానే (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, హనుమ విహారి, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, కుల్దీప్ యాదవ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీకెండ్ సినిమా మొదటి షెడ్యూల్ చీరాల లో ప్రారంభం

త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్‌ పాయింట్‌ కావాలి : అల్లరి నరేశ్

నా ద్రుష్టిలో` డాన్స్ కింగ్ అల్లు అర్జున్ - పుష్ప 2 సాంగ్ కు నో ఫీజ్ : శ్రీలీల స్టేట్ మెంట్

చివరి రోజు.. చివరి షాట్... ఎంత అద్భుతమైన ప్రయాణం : అల్లు అర్జున్

ఎట్టకేలకు ఓ ఇంటివాడైన నటుడు పెనుమత్స సుబ్బరాజు!

తర్వాతి కథనం
Show comments