టోక్యో ఒలింపిక్స్ : మీరా భాయ్‌కు వెండిపతకం

Webdunia
శనివారం, 24 జులై 2021 (12:23 IST)
టోక్యో కేంద్రంగా ప్రారంభమైన ఒలింపిక్ పోటీల్లో భారత్ పతకాల ఖాతా ప్రారంభమైంది. ఈ పోటీల తొలి రోజే ఇండియా ప‌త‌కాల బోణీ కొట్టింది. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయ్ చాను సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచింది. 
 
2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో మెడ‌ల్ గెలిచిన తొలి అథ్లెట్‌గా మీరాబాయ్ నిలిచింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో మన తెలుగు తేజం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ్రాంజ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. ఇప్పుడు మీరాబాయ్ సిల్వ‌ర్‌తో మెరిసింది.
 
స్నాచ్‌, క్లీన్ అండ్ జెర్క్ క‌లిపి ఆమె 202 కేజీల బ‌రువు ఎత్తింది. మ‌రోవైపు చైనా వెయిట్‌లిఫ్ట‌ర్ హౌ ఝిఝి 210 కేజీల‌తో గోల్డ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. ఇండోనేషియాకు బ్రాంజ్ మెడ‌ల్ ద‌క్కింది. గోల్డ్ కోసం క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయ్ చివ‌రి ప్ర‌య‌త్నంలో 117 కేజీల బ‌రువు ఎత్త‌డానికి ప్ర‌య‌త్నించి విఫలమై వెండి పతకంతో సరిపెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

తర్వాతి కథనం
Show comments