దేశంలో బంగారం ధర మళ్లీ పెరిగింది. గత రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన పసిడి రేటు శనివారం మాత్రం పెరిగింది. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరిగింది.
దీంతో బంగారం ధర రూ.48,770కు చేరింది. ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.150 పెరుగుదలతో రూ.44,700కు చేరింది.
మరోవైపు వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్‌లో వెండి రేటు రూ.400 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.72,300 చేరింది. శుక్రవారంతో పోలీస్తే శనివారం తులం బంగారం ధర రూ.170 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.
* హైదరాబాద్‌లో శనివారం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.44,700 గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,770 వద్ద కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,700 వద్ద ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.48,770 గా ఉంది.
* దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రూ.51,110 వద్ద కొనసాగుతోంది.
* ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.46,870 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,870 వద్ద ఉంది.