Publish Date: Tue, 20 Jul 2021 (08:04 IST)
Updated Date: Tue, 20 Jul 2021 (08:06 IST)
దేశంలో బంగారు ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒక రోజు తగ్గడం, మరోరోజు పెరగడం జరుగుతున్నాయి. సోమవారం తగ్గిన బంగారం ధరలు మంగళవారం పెరిగాయి.
అయితే తాజా ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో చూసుకుంటే… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.45,000కి చేరింది.
అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.900 పెరిగి రూ.49,090 కి చేరింది. బంగారం ధరలు పెరగగా మరో వైపు వెండి ధరలు మాత్రం భారీగా తగ్గిపోయాయి. కిలో వెండి ధర రూ.300 తగ్గి 72,900కి చేరింది.