Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిఫా వరల్డ్ కప్ : క్రోయేషియా చేతిలో అర్జెంటీనా.. నాకౌట్ సంక్లిష్టం

రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 16 ప్రపంచ కప్‌ల ప్రస్థానం కలిగిన అర్జెంటీనాకు తేరుకోలేని షాక్ తగిలింది. క్రోయేషియా జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఫలితంగ

Webdunia
శనివారం, 23 జూన్ 2018 (08:57 IST)
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పోటీల్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 16 ప్రపంచ కప్‌ల ప్రస్థానం కలిగిన అర్జెంటీనాకు తేరుకోలేని షాక్ తగిలింది. క్రోయేషియా జట్టు చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఫలితంగా నాకౌట్ అవకాశాలను మెస్సీసేన సంక్లిష్టం చేసుకుంది.
 
ఐస్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌ను డ్రా చేసుకొని టోర్నీని పేలవంగా ఆరంభించిన అర్జెంటీనా.. మలిపోరులో మరింత చెత్తగా ఆడింది. శుక్రవారం రాత్రి జరిగిన గ్రూప్‌ - డి మ్యాచ్‌లో 0-3తో క్రొయేషియా చేతిలో దారుణ ఓటమి చవిచూసింది. మ్యాచ్‌లో బంతిని అధిక సమయం తమ నియంత్రణలోనే ఉంచుకున్నా మెస్సీసేన ఒక్కగోల్‌ కూడా కొట్టలేకపోయింది. 
 
ద్వితీయార్థంలో అర్జెంటీనా డిఫెన్స్‌ పూర్తిగా తేలిపోయింది. గోల్‌ కీపర్‌ విల్లీ కబాలెరో చేసిన ఘోర తప్పిదాన్ని సొమ్ము చేసుకుంటూ గోల్‌ కొట్టిన అంటీ రెబిచ్‌ (53వ) మ్యాచ్‌ను మలుపు తిప్పగా.. లుకా మోడ్రిచ్‌ (80వ) గోల్‌తో 2-0తో జట్టు విజయం ఖాయమైంది. ఆపై, ఇంజ్యూరీ టైమ్‌లో ఇవాన్‌ రకిటిచ్‌ మరో గోల్‌ సాధించి క్రొయేషియా ఆనందాన్ని మూడింతలు చేశాడు. 
 
రెండు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే పాయింట్‌తో నిలిచిన అర్జెంటీనా టోర్నీలో ముందంజ వేయాలంటే ఆఖరి మ్యాచ్‌లో నైజీరియాపై కచ్చితంగా నెగ్గాల్సిందే. దానితో పాటు ఈ గ్రూప్‌ చివరి మ్యాచ్‌లో ఐస్‌లాండ్‌ను క్రొయేషియా ఓడించాలి. డ్రా చేసుకున్నా సరిపోతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments