Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫిఫా- శృంగారానికి అస్సలు దూరం కావొద్దన్న రొమారియో.. జీసస్ ఏం చేస్తాడో?

రష్యాలో జూన్ 14వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఫిఫా ప్రపంచ కప్ జరుగనుంది. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు చెందిన జట్లు పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ సమయంలో శృంగారానికి అస్సలు దూరం కావొచ్చద

Advertiesment
Romario
రష్యాలో జూన్ 14వ తేదీ నుంచి నెల రోజుల పాటు ఫిఫా ప్రపంచ కప్ జరుగనుంది. ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు చెందిన జట్లు పాల్గొననున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ సమయంలో శృంగారానికి అస్సలు దూరం కావొచ్చదని బ్రెజిల్ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు రొమారియో అన్నాడు. ఆటలో రాణించాలంటే.. ఆటలో ఏకాగ్రత చెక్కు చెదరకుండా వుండాలంటే శృంగారంలో పాల్గొనడమే ఉత్తమ మార్గమని రొమారియో చెప్పాడు. 
 
మ్యాచ్‌ల మధ్య విరామం దొరికిన ప్రతిసారీ శృంగారంలో పాల్గొనాలని రొమారియా తెలిపాడు. మ్యాచ్‌ల సమయంలో మాత్రం దృష్టంతా ఆటమీదే ఉండాలన్నాడు. 1994 ప్రపంచకప్‌లో తాను ఐదు గోల్స్ కొట్టి ''ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ'' అవార్డు గెలుచుకోవడానికి అదే కారణమని గుర్తు చేసుకున్నాడు.
 
తన సలహాను పాటించి గోల్స్ సాధించాలని.. ముఖ్యంగా బ్రెజిల్ ఫేవరేట్ ఫుట్‌బాల్ స్టార్ అయిన 21 ఏళ్ల గాబ్రియల్ జీసస్‌ తన సలహా పాటించి గోల్స్ సాధించాలని రొమారియో సూచించాడు. మరి జీసన్ గోల్స్ సాధన కోసం రొమారియాను ఫాలో అవుతాడో ఏమో..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోహ్లీ సెల్ఫీలో అనుష్క మిస్సింగ్.. ఎక్కడుందంటే.. జిమ్‌లో?