Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రీస్తు చనిపోయిన తరువాత తిరిగి లేచారనడం అవాస్తవం: ఇళయరాజా

ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విదేశాల్లో నిర్వహించే సంగీత కార్యక్రమాల్లో తన పాటలు పాడకూడదని.. తన పాటలు తీసుకోవాలంటే.. తన అనుమతి తీసుకోవాలని గతంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా నోటీసులు పంపిన సంగతి తెలి

క్రీస్తు చనిపోయిన తరువాత తిరిగి లేచారనడం అవాస్తవం: ఇళయరాజా
, గురువారం, 10 మే 2018 (13:39 IST)
ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విదేశాల్లో నిర్వహించే సంగీత కార్యక్రమాల్లో తన పాటలు పాడకూడదని.. తన పాటలు తీసుకోవాలంటే.. తన అనుమతి తీసుకోవాలని గతంలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై బాలు కూడా స్పందించారు. ఇకపై ఇళయరాజా పాటలు పాడనని నిర్ణయించుకున్నాడు. 
 
తామిద్దరం మంచి స్నేహితులమే అయినప్పటికీ ఇళయరాజా నోటీసులకు తాను బదులివ్వాలని.. అందుకే ఆయన పాటలను పాడేది లేదని బాలు తెలిపారు. ఈ వివాదాన్ని పక్కనబెడితే.. తాజాగా సంగీత దర్శకుడు ఇళయరాజా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని ప్రస్తావిస్తూ, మరణించిన వారు తిరిగి లేవడం ఒక్క రమణ మహర్షికి మాత్రమే సాధ్యమైందని చెప్పిన వీడియో ప్రస్తుతం వివాదానికి దారితీసింది.
 
ఇళయరాజా కామెంట్స్‌కు సంబంధించిన వీడియోలను ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని చెన్నై కలెక్టర్ నుంచి పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు వెళ్లాయి. ఇటీవల ఓ సంగీత విభావరిలో మాట్లాడిన ఇళయరాజా, క్రీస్తు చనిపోయిన తరువాత తిరిగి లేచాడని క్రైస్తవులు నమ్ముతున్నారని, అది వాస్తవం కాదని కొందరు పరిశోధకులు తేల్చారన్నారు. 
 
దీనికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో ఉన్నాయంటూ ఓ వీడియోను కూడా ఇళయరాజా ప్రదర్శించారు. ఇళయరాజా కామెంట్స్‌పై క్రైస్తవ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. పలు ప్రాంతాల్లో ఆయనపై పోలీసులు కేసులను నమోదు చేశారు. కలెక్టర్ కార్యాలయం, కమిషనర్ కార్యాలయం ముందు క్రైస్తవులు ధర్నాకు దిగారు. దీంతో మొత్తం ఘటనపై విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీర్తిలో మా అమ్మను చూశాను.. "మహానటి"పై సావిత్రి కుమార్తె కామెంట్స్