రోనాల్డో గోల్స్‌తో ఆటాడుకుంటున్నాడు.. కానీ మెస్సీ మాత్రం చేతులెత్తేస్తున్నాడు..
2016 కోపా అమెరికా కప్‌లోనూ చిలీతో మ్యాచ్‌లో ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సి పెనాల్టీని గోల్‌గా మలచలేక విఫలమయ్యాడు. ఇలా ఇప్పటివరకూ ఏడు సార్లు పెనాల్టీ అవకాశాలు వచ్చినా.. అందులో మూడుసార్లు మాత్రమే మెస్స
2016 కోపా అమెరికా కప్‌లోనూ చిలీతో మ్యాచ్‌లో ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సి పెనాల్టీని గోల్‌గా మలచలేక విఫలమయ్యాడు. ఇలా ఇప్పటివరకూ ఏడు సార్లు పెనాల్టీ అవకాశాలు వచ్చినా.. అందులో మూడుసార్లు మాత్రమే మెస్సీ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లలోనూ అందరి దృష్టి క్రిస్టియానో రొనాల్డో, మెస్సిపైనే ఎక్కువగా ఉంది.
కానీ తొలి మ్యాచ్‌లో మాత్రం రొనాల్డో హ్యాట్రిక్ గోల్‌తో అదరగొట్టగా, మెస్సీ మాత్రం వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోని తన స్థాయికి తగ్గ ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయాడు. పసికూన ఐస్‌లాండ్‌తో జరిగిన పోరులో చాలాసార్లు గోల్ ప్రయత్నాలు చేసినా ఒక్కసారి కూడా ఫలితం రాబట్టలేకపోయాడు.
మ్యాచ్ 1-1తో స్కోరు సమమైన దశలో 63వ నిమిషంలో అర్జెంటీనాకు పెనాల్టీ అవకాశం వచ్చింది. ఈ క్రమంలో పెనాల్టీని గోల్‌గా మలచలేక మెస్సీ విఫలమయ్యాడు. ఐస్‌లాండ్ గోల్‌కీపర్ హేన్స్ డిఫెన్స్‌ను ఛేదించలేక మెస్సి పెనాల్టీని చేజేతులా మిస్ చేశాడు. ఫలితంగా అర్జెంటీనా మ్యాచ్‌ను డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
మరోవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న మెస్సీ తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడంటూ అభిమానులు నెట్టింట భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇంకా కొందరు నెటిజన్లు రొనాల్డో అన్ని రకాలుగా గోల్స్ అదరగొడుతుంటే మెస్సీ మాత్రం విఫలమవుతున్నాడని మండిపడుతున్నారు.