నీరజ్ చోప్రాకు మహీంద్రా ఎక్స్ యూవీ-700 వాహనం కానుక

Webdunia
ఆదివారం, 8 ఆగస్టు 2021 (15:46 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత అథ్లెటిక్స్ రంగంలో హర్యానా కుర్రాడు నీరజ్ చోప్రా ఇప్పుడో సరికొత్త సంచలనంగా మారాడు. ఈ పోటీల్లో దేశానికి బంగారు పతకం సాధించిపెట్టాడు. తద్వారా ఒలింపిక్ చరిత్రలోనే అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పసిడి పతకం అందించిన ఘతను సొంతం చేసుకున్నాడు. దాంతో ఈ ఆర్మీ మ్యాన్‌పై నజరానాల వర్షం కురుస్తోంది. 
 
తాజాగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తమ కంపెనీ తయారు చేసిన వాహనాన్ని నీరజ్ చోప్రాకు బహూకరించనున్నట్టు తెలిపారు. చోప్రా టోక్యోలో బంగారు పతకం గెలిచిన తర్వాత ఆనంద్ మహీంద్రా ఓ ట్వీట్ చేశారు. 
 
ఓవైపున టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ బాహుబలి చిత్రంలో ఈటెను పట్టుకుని గుర్రంపై వస్తున్న ఫొటో, మరో పక్కన జావెలిన్ త్రో విసురుతున్న నీరజ్ చోప్రా ఫొటోను ఆయన పంచుకున్నారు. నీరజ్ చోప్రాను బాహుబలిగా అభివర్ణించారు. మేమంతా నీ సైన్యంలో ఉన్నాం అని పేర్కొన్నారు.
 
ఈ ట్వీట్‌కు ఓ నెటిజన్ స్పందిస్తూ, నీరజ్ చోప్రాకు మహీంద్రా ఎక్స్ యూవీ-700 వాహనం కానుకగా అందించాలని సూచించాడు. అందుకు వెంటనే స్పందించిన ఆనంద్ మహీంద్రా... ఎక్స్ యూవీ వాహనాన్ని సిద్ధంగా ఉంచాలంటూ తన సంస్థ ఉద్యోగులను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Laddu Ghee Case: తిరుమల లడ్డూల తయారీకి కల్తీ నెయ్యి.. టీటీడీ ఇంజనీరింగ్ అధికారి అరెస్ట్

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై అక్రమాస్తుల కేసును కొట్టేయొద్దు

ఓ ఇంటర్వ్యూ పాత పగను రగిల్చింది... మాజీ నక్సలైట్‌ను హత్య

పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ.. పాక్ పౌరులకు వీసాలు నిలిపివేత

అస్సాంలో బహు భార్యత్వంపై నిషేధం... అతిక్రమిస్తే పదేళ్ల జైలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్ సన్నివేశాలున్నాయి.. కానీ నగ్నంగా నటించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఆండ్రియా

కూలీ ఫట్.. టాలీవుడ్ టాప్ హీరోలు వెనక్కి.. పవన్ మాత్రం లోకేష్‌తో సినిమా చేస్తారా?

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

తర్వాతి కథనం
Show comments