భక్తులకు తితిదే నయా రూల్: వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతి

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (09:43 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇకపై కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారికే స్వామి దర్శనభాగ్యం లభించనుంది. 
 
వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ కానీ, దర్శనానికి మూడు రోజులు ముందు చేయించుకున్న కరోనా పరీక్ష నెగటివ్ సర్టిఫికెట్ కానీ ఉంటేనే దర్శనానికి అనుమతి ఇస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. 
 
అలాగే, శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తామన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల టోకెన్లు విడుదల చేయనున్నట్టు చెప్పారు. 
 
సర్వదర్శనం టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత తిరుపతిలో ఆఫ్‌లైన్ ద్వారా ఇస్తున్న టోకెన్లను నిలిపివేయనున్నారు. అలాగే, అక్టోబరు నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
 
తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు వీలుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులోభాగంగా, కరోనా వైరస్ బాధితులు కొండపైకి రాకుండా ఉండేందుకే ఈ కొత్త నిబంధనను అమలు చేస్తున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

తర్వాతి కథనం
Show comments