Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ టెంపుల్‌ వినాయకుడి అరుదైన రికార్డ్.. వైఢూర్య కిరీటంతో..?

Webdunia
శనివారం, 29 జులై 2023 (10:20 IST)
Golden Temple Ganapathi
తిరుపతి, కాణిపాకం దర్శనాలకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా వెల్లూరు గోల్డెన్ టెంపుల్‌లోని వినాయకుడిని పూజించడం చేస్తారు. ఈ ఆలయంలో బంగారు లక్ష్మీదేవి విగ్రహంతో పాటు.. ప్రపంచంలోనే అతిపెద్ద 1,700 కిలోల వెండి శ్రీ శక్తి గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
 
2021 జనవరి 25వ తేదీన ఈ విగ్రహాన్ని ప్రతిష్టించారు. తాజాగా ఈ శక్తి గణపతి విగ్రహానికి అలంకరించిన కిరీటం అరుదైన రికార్డును సాధించింది. ఈ కిరీటంలో అరుదైన వైఢూర్యాన్ని పొదిగించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వైఢూర్యంగా రికార్డ్ సృష్టించింది. ఈ వజ్రం 880 క్యారెట్ల బరువు కలిగివుంది. 
 
ఇప్పటివరకూ ప్రపంచ రికార్డులో నిలిచిన అతిపెద్ద వైఢూర్యం బరువు 700 క్యారెట్లు మాత్రమే కావడం గమనార్హం. సహజంగా నవరత్నాలకు ప్రత్యేక శక్తిని కలిగివుంటాయి. తొమ్మిది గ్రహాలలోని శక్తులు అక్కడ ప్రసరింపజేస్తాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఆ విధంగా నవరత్నాలలో ఒకటైన వైఢూర్యం కేతు భగవానునికి ప్రతీక. ఆయన శక్తిని అక్కడ ప్రసరింపజేస్తుందని కిరీటం ఏర్పాటు సందర్భంగా పండితులు స్పష్టం చేశారు. ఎంతో విలువైన వైఢూర్యాలను కొనుగోలు చేసి ధరించలేని భక్తులు ఈ గణనాథుడిని దర్శించుకుని ఆశీర్వాదం పొందవచ్చునని శ్రీ శక్తి అమ్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లను విడదీయడం అసాధ్యం: పేర్ని నాని (video)

కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ చేయూత

Navratri Viral Videos: గర్బా ఉత్సవంలో ఆ దుస్తులేంటి? వీడియో వైరల్

Digital Book: డిజిటల్ పుస్తకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్.. వైకాపా మహిళా నేతపైనే ఫిర్యాదు

అన్నీ చూడండి

లేటెస్ట్

Astrology 27-08-2025: శనివారం మీ రాశి ఫలితాలు.. రుణ ఒత్తిడి తొలగుతుంది

Lalita Panchami 2025: లలితా పంచమి రోజున సుమంగళీ పూజ తప్పనిసరి.. కుంకుమ పూజలు చేస్తే?

Gold man: ఆరు కిలోల బంగారు ఆభరణాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మెరిసిన గోల్డ్ మ్యాన్

Navratri Day 5: నవరాత్రులు.. స్కంధమాతను పూజిస్తే... ఆకుపచ్చను ధరించడం చేస్తే?

26-08-2025: శుక్రవారం మీ రాశి ఫలితాలు.. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది?

తర్వాతి కథనం
Show comments