తెలిసీ తెలియక చేసిన పాపాలు తొలగిపోవాలంటే.. చీమలకు బియ్యం చల్లాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఒకరి జన్మలో ఏడు తరాల పాపాలు వుంటాయి. ఈ పాపాల నుంచి విముక్తి లభిస్తుందని వారు చెప్తున్నారు.
శనివారం గుప్పెడు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని పొడి చేసుకుని.. సూర్య నమస్కారం చేయాలి. ఆపై విఘ్నేశ్వరుడిని పూజించి.. ఆలయాన్ని సందర్శించాలి.
మీ చేతిలో ఉంచుకుని సూర్య నమస్కారం చేయండి. హృదయపూర్వకంగా ప్రార్థించిన తర్వాత, సమీపంలోని గణేశ ఆలయాన్ని సందర్శించండి. ఆలయంలో రావిచెట్టు కింద వుండే విఘ్నేశ్వరునికి నమస్కరించి.. మూడుసార్లు ప్రదక్షణ చేసి రావిచెట్టుకు సమీపంలో బియ్యం పిండిని చల్లండి.
ఈ బియ్యం పిండిని చీమలు తీసుకోవడం ద్వారా మన పాపాలు తొలగిపోతాయి. అలాగే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. చీమలకు ఇలా బియ్యం రవ్వలా చేసుకుని చల్లడం ద్వారా నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.
అందుకే బియ్యం పిండితో మన పూర్వీకులు ముగ్గులు వేసేవారని.. ఆ పిండిని సూక్ష్మంగా వుండే జీవులు తింటే.. సమస్త దోషాలను తొలగిస్తాయని విశ్వాసం.