Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తోరణ గణపతిని పూజిస్తే రుణాల బాధ పరార్.. నెయ్యి, ఆముదంతో దీపం..?

తోరణ గణపతిని పూజిస్తే రుణాల బాధ పరార్.. నెయ్యి, ఆముదంతో దీపం..?
, శుక్రవారం, 23 జూన్ 2023 (22:53 IST)
వినాయకుడు ఆదిదేవుడు. విఘ్నరాజు. అలాంటి వినాయకుడు రావిచెట్టు కింద వుండటం విశేషం. అలాంటి వినాయకుడిని పూజించడం ద్వారా సర్వసుఖాలు చేకూరుతాయి. సంతానం కలుగుతుంది. మర్రిచెట్టు కింద వినాయకుడిని పూజించడం ద్వారా దుష్టశక్తులు తొలగిపోతాయి. వేపచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే దీర్ఘకాలంగా ఉన్న వ్యాధులు నయమవుతాయి. ఆ క్రమంలో తోరణ గణేశుడిని పూజిస్తే అప్పులన్నీ తీరిపోతాయి. 
 
ఏ సన్నిధిలోనైనా తోరణ ద్వారం వైపు చూస్తున్న వినాయకుడిని తోరణ గణేశుడు అని పిలుస్తారు. తోరణ వినాయకుడు జటా కిరీటం, మెడలో రుద్రాక్ష మాల, పై రెండు చేతులలో అంకుశం, బాసం, కింది రెండు చేతులలో దంతాలు, మోదకం ధరించి అనుగ్రహిస్తాడు.
 
తన చేతిలో ఉన్న తొండంతో మానవుల జీవితంలో ఉన్న అప్పులన్నీ తీరుస్తానని శివ ఆగమ శాస్త్రం చెప్తోంది. తోరణ గణపతి స్థానం బ్రహ్మ స్థానం అవుతుంది. పద్మాసనంపై కూర్చుని వుండే ఈ వినాయకుడు అదృష్టాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదిస్తాడు. 
 
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి దేవ రుణం, పితృ రుణం, మనుష్య రుణం అనే మూడు రకాల రుణాలు ఉంటాయి. వీటిలో మానవ రుణం అంటే మనం తోటి మనుషులకు రుణం. తోరణ గణేశుడిని పూజించడం వలన ఈ రుణం త్వరగా తీరిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి గొప్ప ఫలితాలు లభిస్తాయి. 
 
మంగళ, శని, ఆదివారాల్లో ఈ మూడు రోజులలో ఏదో ఒకదాన్ని ఎంచుకుని ఆ రోజు వరుసగా 6 వారాల పాటు తోరణ గణపతిని పూజించాలి. ఆయనకు స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించాలి. ఆముదం నూనెను కూడా ఉపయోగించి మూడు దీపాలను వెలిగించాలి. అలాగే ఆయన ముందు కూర్చుని తోరణ గణపతి మూల మంత్రాన్ని 12 సార్లు జపించాలి. మామిడి, జామ, దానిమ్మ, ద్రాక్ష, నారింజ వంటి ఐదు రకాల పండ్లను నైవేద్యంగా వుంచి పూజించాలి. ఇలా చేయడం వల్ల త్వరలోనే అప్పులన్నీ తీరిపోయి మనశ్శాంతి పొందుతారు.
 
తోరణ గణపతి మూల మంత్రం:
ఓం శ్రీం హ్రీం క్లాం కలేలం కం తోరణ గణపతయే
సర్వాచార్య కర్తాయ సకల సిద్ధికరాయ సర్వజన వశీకరణాయ
రుణమోచన వల్లబాయ హ్రీం కం గణపతయే స్వాహా ॥

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పచ్చకర్పూరం-స్పటికంతో మీ కోరికలు నెరవేరుతాయంటే నమ్ముతారా?