భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలకు కూడా సాధ్యంకాని అరుదైన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. టెస్ట్ క్రికెట్, వన్డేలు, టీ20 ఫార్మెట్లలో కలిపి సెంచరీలు సాధించిన భారత ఏకైక కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఈ ఘనతను సాధించిన నాలుగో కెప్టెన్‌గా మారింది.
కెప్టెన్‌గా టెస్ట్, వన్డే, టీ20 మూడు ఫార్మెట్లలో సెంచరీలు చేశాడు. భారత కెప్టెన్లలో మెరవరూ ఈ ఘనతను సాధించలేక పోయారు. కెప్టెన్‌గా మూడు ఫార్మెట్లలో సెంచరీలు చేసిన ఘనతను ఇప్పటివరకు వరకు ముగ్గురు కెప్టెన్లు సాధించారు. వీరిలో శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్నే దిల్షాన్, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఉన్నారు.
ఇపుడు వీరి సరసన రోహిత్ శర్మ కూడా చేరారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. రోహిత్ 212 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్స్‌ల సాయంతో 120 రన్స్ చేసి తన వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ఆ తర్వాతృ కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.