Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యనారాయణుడి పరిహార క్షేత్రం.. ఇక్కడ నవగ్రహాలకు వాహనాలుండవ్..

Webdunia
సోమవారం, 25 మార్చి 2019 (17:46 IST)
నవగ్రహాల్లో సూర్యదేవునిది ప్రత్యేకమైన స్థానం. సమస్త జగత్తుకు వెలుగులు ప్రసాదిస్తూ జీవ వైవిధ్యాన్ని నెలకొల్పుతాడు. నవగ్రహ స్తోత్రంలో ఆదిత్యయాచ అంటూ మొదటిగా సూర్యభగవానుడిని ప్రార్థిస్తాం. సూర్యభగవానుడు ఇతర గ్రహాలతో కలిసి నెలవైన పవిత్ర క్షేత్రమే తమిళనాడులోని కుంభకోణం సమీపంలోని సూర్యనార్‌ కోవిల్‌. ఈ ఆలయానికి స్థలపురాణం ఉంది. 
 
పూర్వం కాలవముని అనే యోగి కుష్టువ్యాధితో బాధపడేవాడు. తనకు వ్యాధి నుండి విముక్తి కలిగించమని నవగ్రహాలను వేడుకున్నాడు. అందుకు గ్రహాధిపతులు అనుగ్రహించి వ్యాధి నివారణ చేసారు. దాంతో సృష్టికర్త అయిన బ్రహ్మకు ఆగ్రహం వచ్చింది. గ్రహాలు మానవుల్లో మంచి చెడులకు సంబంధించిన ఫలితాలు ఇవ్వాలే కానీ ప్రకృతి విరుద్ధ కార్యాలు చేయకూడదని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించినందుకు భూలోకంలో శ్వేత పుష్పాల అటవీ ప్రాంతానికి వెళ్లిపొమ్మని శపించాడు. 
 
దాంతో భూలోకానికి చేరుకున్న నవగ్రహాలు శాప విముక్తి కోసం పరమేశ్వరుడి గురించి తపస్సు చేసారు. ప్రత్యక్షమైన పరమేశ్వరుడు శాప విమోచనం కలిగించి, వరాన్ని కూడా ఇచ్చాడు. వారు తపస్సు చేసి అనుగ్రహం పొందిన స్థలానికి వచ్చి సమస్యలు ఉన్నవారు నవగ్రహాలను ప్రార్థిస్తే వారి సమస్యలు తీరుతాయని వరాన్ని ప్రసాదించాడు. 
 
ఈ ఆలయంలో నవగ్రహాలకు ప్రత్యేకంగా గుళ్లున్నాయి. ప్రధానమైన సూర్యదేవుడు తన ఇద్దరు సతీమణులైన ఉషాదేవి, ప్రత్యూషదేవిలతో కలిసి భక్తులకు దర్శనమిస్తాడు. సూర్యదేవుడు ఇక్కడ మందహాసంతో రెండు చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్త జన కోటికి ఆశీర్వచనాలు ఇస్తాడు. సూర్యదేవుని మందిరానికి ఎదురుగానే బృహస్పతి మందిరముంది. 
 
నవగ్రహాలకు వాటి వాహనాలు ఇక్కడ కనిపించవు. గ్రహబాధల నుంచి విముక్తి పొందడానికి వేలాదిమంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. గ్రహబాధలు ఎక్కువగా ఉన్న వారు 12 ఆదివారాలు ఆలయంలోనే బసచేసి నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన తదితర పూజలు నిర్వహిస్తారు.

తులాభారంలో భాగంగా తమ బరువుకు సమానమైన గోధుమ, బెల్లం తదితర వ్యవసాయ ఉత్పత్తులను ఆలయానికి ఇస్తుంటారు. చక్కెర పొంగలి ప్రసాదాన్ని కూడా పూజలో భాగంగా పంపిణీ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: మంగళగిరిలో పెట్టుబడులు పెట్టడానికి ఐటీ కంపెనీలు సిద్ధంగా వున్నాయ్: నారా లోకేష్

క్వార్ట్జ్ అక్రమ రవాణాలో వైకాపా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. అరెస్టు తప్పదా?

ఆరేళ్ల బాలికపై పొరుగింటి వ్యక్తి అత్యాచారం.. చాక్లెట్లు కొనిపెడతానని.. మద్యం మత్తులో?

కారు డ్రైవర్ హత్య డోర్ డెలివరీ కేసు మళ్లీ విచారణకు ఆదేశం

TGRTC: టీజీఆర్టీసీ బస్సుకు నిప్పెట్టిన గంజాయ్ బ్యాచ్.. రాత్రి నిప్పెట్టారు.. ఏమైంది?

అన్నీ చూడండి

లేటెస్ట్

22-07-2025 మంగళవారం దినఫలితాలు - ఓర్పుతో మెలగండి.. స్థిరాస్తి ధనం అందుతుంది...

Bhauma Pradosham: భౌమ ప్రదోషం-రుణ విమోచన ప్రదోషం.. ఇలా చేస్తే అప్పులు తీరడం ఖాయం

NRI: గుడ్ న్యూస్- శ్రీవారి వీఐపీ దర్శనం.. ఎన్నారై కోటాను రోజుకు వందకి పెంచారోచ్!

Rohini Vrat 2024: రోహిణి వ్రతం ఆచరిస్తే.. పేదరికం పరార్

Kamika Ekadashi: కామిక ఏకాదశి: శ్రీ విష్ణు సహస్రనామం పఠిస్తే.. లక్ష్మీదేవిని పూజిస్తే?

తర్వాతి కథనం
Show comments