Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మో.. ఆ దేవాలయానికి వెళ్లేది లేదు.. జడుసుకుంటున్న ప్రజలు?

అమ్మో.. ఆ దేవాలయానికి వెళ్లేది లేదు.. జడుసుకుంటున్న ప్రజలు?
, బుధవారం, 20 మార్చి 2019 (15:56 IST)
భారతదేశం ఆలయాలకు పుట్టిల్లు. మన దేశంలో లెక్కపెట్టలేనన్ని దేవాలయాలు ఉన్నాయి. ఒక్కో దేవాలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటన్నింటినీ మనం సందర్శించి పుణ్యాన్ని మూటగట్టుకుంటాం. కానీ ఒక దేవాలయాన్ని సందర్శించడానికి మాత్రం ప్రజలు భయపడిపోతారు. ఆ ప్రాంగణంలో అడుగుపెట్టడానికే గజగజా వణికిపోతారు. 
 
ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు కానీ ఇది అక్షరాలా సత్యం. భారతదేశంలో ఇలాంటి ఆలయం ఉందంటే మీరు నమ్మరు. అది మృత్యుదేవత యమధర్మరాజు ఆలయం. ఇది ఈ ప్లానెట్‌లో ఉండే ఏకైక మృత్యుదేవత ఆలయం. హిమాచల్ ప్రదేశ్ జిల్లాలో చంబాలో భార్మార్ వద్ద ఇది నెలకొని ఉంది. ఈ దేవాలయం చూడటానికి ఇల్లులా ఉంటుంది. 
 
ఇందులో నెలవైన మృత్యుదేవతను దర్శించుకోవడానికి ప్రజలు భయపడిపోతారు. బయట నుండే ప్రార్థనలు చేసి వెళ్లిపోతారు. ఒక గది యమధర్మరాజు సహాయకుడు చిత్రగుప్తునికి అంకితం చేయబడింది. ఇతను ప్రజలు చేసే పుణ్య, పాపాల జాబితాను తయారు చేస్తాడు. ఈ ఆలయంలో బంగారం, వెండి, కాంస్యం, ఇనుముతో చేసిన నాలుగు అదృశ్య తలుపులు ఉన్నాయని నమ్ముతారు. 
 
పురాణాల ప్రకారం, ఏ ఆత్మ ఏ ద్వారం గుండా వెళ్ళాలో యమధర్మరాజు నిర్ణయిస్తాడని నమ్మకం. ఏ ఆత్మైనా మొదటిగా మంచి చెడులను నమోదు చేసే చిత్రగుప్తుని దగ్గరకు వెళ్తుంది. దాన్నిబట్టి ఏ ఆత్మ ఏ ద్వారం నుండి వెళ్లాలో నిర్ణయించబడుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హోలీ పండుగ ప్రాముఖ్యత ఏమిటి..?