Publish Date: Wed, 20 Mar 2019 (12:51 IST)
Updated Date: Wed, 20 Mar 2019 (14:16 IST)
కొందరు పిల్లలు అందరిలో కలవడానికి సిగ్గుపడుతుంటారు. ఇంకా చెప్పాలంటే కొత్తవారితో మాట్లాడేందుకు భయపడుతారు. మరి అలాంటి చిన్నారుల్లో మార్పు తేవాలంటే.. ఏం చేయాలో తెలుసుకుందాం..
పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంటే.. వాళ్లకు ఇష్టంలేకపోతే వచ్చేయొచ్చని చెప్పి చూడండి.. వాళ్లు అర్థం చేసుకుంటారు. ఇలా చేస్తే నలుగురిలోకి రావడానికి వారు సంకోచిస్తారు. రోజూ సాయంత్రం ఓ గంటపాటు తోటివారితో ఆడుకునేలా చేయాలి. ఒకే వయసున్న వారిని పరిచయం చేస్తే వీళ్లల్లో భయం పోతుంది. చిన్నారుల్లో ఏ మాత్రం మార్పు కనిపించినా.. వెంటనే గుర్తించి ప్రసంసించండి. ఇలా చేయడం వలన వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
నలుగురిలో కలిసేలా చూడండి.. అంటే బంధువులు, స్నేహితుల ఇళ్లకు తీసుకెళ్లాలి. అలానే తోటి పిల్లలతో ఎక్కువసేపు గడిపేలా చేయాలి. దీనివలన పిల్లల్లో ఒక్కసారే మార్పు కాదు కానీ.. భయం నెమ్మదిగా పోతుంది. చివరగా చిన్నారుల్లో ధైర్యం రావాలంటే.. వాళ్లకు ఇష్టమైన అభిరుచిలో శిక్షణ ఇప్పించడం చేస్తే.. వారిలో నలుగురిలో కలవడంపై ఉన్న భయం, బిడియం వదులుతుంది.
webdunia
Publish Date: Wed, 20 Mar 2019 (12:51 IST)
Updated Date: Wed, 20 Mar 2019 (14:16 IST)