ప్రభాస్‌లో మచ్చుకైనా భయం లేదు : హాలీవుడ్ స్టంట్‌మాస్టర్

బుధవారం, 20 మార్చి 2019 (12:42 IST)
ప్రభాస్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'సాహో' సినిమా. అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దేశ విదేశాల్లో షూటింగ్‌లు చేసుకుంటున్న ఈ సినిమాకి, హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ కెన్నీ బేట్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను డిజైన్ చేస్తున్నాడు.
 
ఇటీవల ఆయన ప్రభాస్ గురించి మాట్లాడుతూ, "యాక్షన్ ఎపిసోడ్స్‌లో ప్రభాస్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడనీ, సాధారణంగా హై రిస్క్ వుండే యాక్షన్ సీన్స్ చేసిన తర్వాత చాలామంది హీరోలు అలసిపోతుంటారు. కానీ అలాంటి అలసట నేను ఇంతవరకూ ప్రభాస్‌లో చూడలేదని చెప్పారు. 
 
ఉదయాన్నే సెట్స్‌కి వచ్చినప్పుడు ఆయన ఎంత ఉత్సాహంగా ఉంటాడో.. రోజంతా కూడా అంతే ఉత్సాహంగా ఉంటాడు. యాక్షన్ సీన్స్ చేసే విషయంలో ఆయనకి ఎంతమాత్రం సందేహం లేకపోవడం.. బెదురు లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నేను అబ్బాయిగా పుట్టాను.. కానీ నాలో ఓ మహిళ ఉంది...