ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ కుమార్తె ఎట్టా (19) తన ప్రేయసిని ప్రేమ వివాహం చేసుకుంది. లెస్బియన్లు అయిన తాము పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది. వివరాల్లోకి వెళితే.. జాకీచాన్ 19 ఏళ్ల కుమార్తె ఎట్టా నక్ తన లెస్బియన్ అటున్‌ను వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివాహ పత్రికను షేర్ కూడా చేసింది.
1990 ఆసియా యూనివర్శ్ అయిన ఎలైన్ నక్‌కు జాకీచాన్‌కు పుట్టిన ఎట్టా నక్.. కెనడాకు చెందిన సోషల్ మీడియా సెలెబ్రిటీ అటున్‌ను పెళ్లి చేసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లోనే ఎట్టా తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలిపింది.
అప్పుడే ఎట్టా నక్ లెస్బియన్ అనే విషయం ప్రపంచానికి తెలిసింది. తాజాగా అటున్‌తో సహజీవనం చేస్తూ వచ్చిన ఎట్టా.. ఆమెనే వివాహం చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధ్రువీకరించింది. తమ వివాహం కెనడాలో నమోదైనట్లు ఎట్టా తెలిపింది.