అనుష్క, షాలినీ పాండే, అంజలి, మాధవన్ కాంబోలో సినిమా

సోమవారం, 14 జనవరి 2019 (11:43 IST)
హార్రర్ థ్రిల్లర్‌గా కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో అనుష్క, అంజలి, షాలినీ పాండే హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. బహుభాషా నటుడు మాధవన్ హీరోగా నటిస్తాడని... కోన వెంకట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్, గోపి సుందర్, షనీల్ డియో, గోపి మోహన్, నీరజ కోన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులుగా వ్యవహరిస్తున్నారు. 
 
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని పలు భాషలలో నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నాయి. తెలుగు, తమిళం, హాలీవుడ్ నటీనటులు, సాంకేతిక నిపుణులతో నిర్మితమవుతున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రమిదని కోన వెంకట్ ప్రకటించారు. మార్చి నెలలో చిత్రం షూటింగ్ అమెరికాలో ప్రారంభం కానుంది. 2019 ద్వితీయార్ధంలో చిత్రం విడుదల కానుందని సినీ యూనిట్ వర్గాల సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ప్లాస్టిక్ సర్జరీకి ఎంతవుతుంది..?