25ఏళ్ల బ్యాంకు ఉద్యోగినిపై నలుగురు కామాంధులు విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌కు చెందిన యువతిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, జైపూరుకు చెందిన యువతి.. బ్యాంకు పరీక్షల్లో నెగ్గి.. కుంభకోణంలోని సిటీ యూనియన్ బ్యాంకులో బాధ్యతలు నిర్వర్తించేందుకు అక్కడికి చేరుకుంది.
డిసెంబర్ 2న రాజస్థాన్ నుంచి చెన్నైకి అక్కడ నుంచి కుంభకోణానికి చేరుకుంది. కుంభకోణానికి అర్థరాత్రి చేరుకున్న యువతి.. ఓ ఆటో డ్రైవర్‌కు తాను బస చేయాల్సిన గెస్ట్ హౌస్ గురించి చెప్పింది. కానీ ఆ ఆటో డ్రైవర్ డబ్బుకు ఆశపడి.. ఊరంతా తిప్పాడు. దీంతో అనుమానం చెందిన ఆ యువతి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. దీంతో ఆవేశానికి గురైన ఆటో డ్రైవర్.. నిర్మానుష్య ప్రాంతంలో దించేశాడు. ఆ సమయంలో దిక్కుతోచక రోడ్డుపై నిలబడిపోయిన యువతికి ఇద్దరు యువకులు కనిపించారు. వారిని నమ్మిన యువతి వారితో వెళ్లింది.
ఆపై ఆ కామాంధులు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. వారికి తర్వాత మరో ఇద్దరు స్నేహితులు కూడా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆ మహిళను ఆమె చెప్పిన గెస్ట్ హౌస్‌లో దించేసి పారిపోయారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆపై బ్యాంకు ఉద్యోగంలో చేరిన మహిళ మేనేజర్‌కు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది.
దీంతో షాకైన మేనేజర్.. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆపై బరిలోకి దిగిన పోలీసులు ఆ నలుగురు కామాంధులను అరెస్ట్ చేశారు. కానీ పరారీలో వున్న ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.