సత్యావతారం దత్తాత్రేయ అవతారం

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (15:02 IST)
సాధకులకు దత్తమయ్యే శక్తి దత్త రూపంలో ఉన్న పరబ్రహ్మ శక్తేనని వేరుగా చెప్పవలసిన పనిలేదు. భిన్నత్వంలోని ఏకత్వ దర్శనం ప్రసాదించగడానికే జ్ఞాన స్వరూపమైన దత్తావతారం ఉద్భవించింది. మూడు గుణాలు వీరివే. త్రిగుణాత్మకుడు, త్రిగుణాతీతుడుగా, గురుదేవదత్తగా ఆ పరబ్రహ్మ అవతరించారు.

మహా పతివ్రతైన అనసూయదేవిని పరీక్షించే నిమిత్తం త్రిమూర్తులు యతీశ్వరుల రూపంలో వచ్చి, నగ్నంగా భిక్ష వడ్డించమని అడగడం, ఆమె వారిని పసిపిల్లలుగా మార్చడం, త్రిమాతలు రావడం, త్రిమూర్తులను త్రిమాతలకు అనసూయదేవి అప్పగించడం, త్రిమాతలు, త్రిమూర్తులు సంతోషంగా అత్రి, అనసూయలకు వరం ఇవ్వడం వల్ల దత్తాత్రేయుల జననం జరిగిందని కధనం.
 
దత్తవతారం దశావతారాలకంటే ఎంతో పురాతనమైనది. అన్ని అవతారాలు తమకు నిర్ధేశించిన కార్యము పూర్తిచేసుకొని ఈ లోకమునుండి నిష్క్రమించాయి. దత్త అవతారం మాత్రం నిత్య సత్యావతారంగా విరాజిల్లుతూనే ఉంది. ఇది శిష్టరక్షణకు, దుష్టశిక్షణకు కొరకే గాక, ప్రజలకు జ్ఞానప్రభోధం చేసి, వారిని సన్మార్గంలో చేయడానికి వచ్చిన విలక్షణ అవతారం.
ఏ అవతార మూర్తికీ లేని గురుదేవ అన్న విశేషణం దత్తాత్రేయుల వారికి మాత్రమే ఉంది. అసలు గురుశబ్దం పుట్టింది వీరి నుండే. అందరికంటే జ్ఞానులైన పెద్దవారినే మనం గురువులుగా భావిస్తాము. సమస్త ప్రాణకోటికే కాకుండా సర్వదేవతలకు గురువు దత్తాత్రేయుడు ప్రతి యుగంలోను వేళ్ళమీద లెక్కపెట్ట గలిగినంత మంది రాక్షసులు మాత్రమే లోకాలను గడగడలాడించడం, వారిని సమహరించడానికి అమ్మవారో, అయ్యవారో ప్రత్యేక అవతారాలు ఎత్తి వారిని సంహరించేవారు. అంతటితో కధ సుఖాంతం అయ్యేది. 
 
ఇప్పుడు ప్రతి మనిషిలో కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే రాక్షసులు మద్య నలిగి విలవిలలాడుతున్నాడు. ఇది కలి ప్రభావం వలన మనిషిని అధోగతి పాలుచేస్తుంది. మనిషిని మనిషిగా సాధకునిగా, మహాజ్ఞానిగా, మహయోగిగా మార్చాలని సత్సంకల్పంతో ఆ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వం, త్రిమూర్తితత్వం ఏకత్వ రూపునిగా దత్తాత్రేయుడుగా అవతరించాడు. అప్పటి నుండి ఈ దత్త అవతారాలు కొనసాగుతూనే వచ్చాయి.
 
శ్రీపాద వల్లభునిగా, మాణిక్యప్రభువుగా, నృసింహసరస్వతిగా, అక్కలకోట స్వామిగా, ఈ కలియుగంలో శ్రీ షిరిడి సాయి బాబాగా మానవ రూపంలో అవతరించి మన అందరి కోర్కెలను, కష్టాలను తీరుస్తున్నాడు. బాబా ఎందరో అవదూతల రూపంలో మనకు దర్శనం ఇచ్చి మనలను కాపాడుతూనే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

22-11-2025 శనివారం ఫలితాలు - మీపై శకునాల ప్రభావం అధికం...

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

తర్వాతి కథనం
Show comments