Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధనుర్మాస సోమవారం ఇలా చేస్తే..? 1000 ఏళ్ల పాటు..? (video)

ధనుర్మాస సోమవారం ఇలా చేస్తే..? 1000 ఏళ్ల పాటు..? (video)
, సోమవారం, 28 డిశెంబరు 2020 (05:00 IST)
ధనుర్మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దీపాలు వెలిగించడం చేస్తే.. శ్రీ మహా విష్ణువును 1000ఏళ్ల పాటు పూజించిన ఫలం దక్కుతుందట. ధనుర్మాసం మొత్తం కాకపోయినా.. ధనుర్మాస సోమవారమైన శ్రీ విష్ణుస్తుతి చేయడం వెయ్యి రెట్ల ఫలితం లభిస్తుంది. 
 
ధనుర్మాసంలో ప్రతీరోజూ నదీ స్నానం చేయడం ద్వారా అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. అలాగే తులసీ కోట వద్ద నేతి దీపం వెలిగించడం.. విష్ణు సహస్ర నామ పారాయణ, తిరుప్పావై పఠించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 
 
ముఖ్యంగా ధనుర్మాసంలో ఇంటి ముందు రంగవల్లికలు పువ్వులతో ముగ్గులు వేయడం మరవకూడదు. ధనుర్మాసంలో గోదాదేవి కల్యాణం జరిపించడం చేస్తే సమస్త సౌభాగ్యాలు చేకూరుతాయి. అలాగే శివకేశవులకు కార్తీక మాసం ఎలాంటి ప్రాశస్త్యమో.. అలాగే ధనుర్మాసంలో వచ్చే సోమవారం పూట శివునిని దీనబందు స్తోత్రం వింటే కటిక పేదవాడైనా ఐశ్వర్యవంతుడు అవుతాడని విశ్వాసం. 
webdunia
Lord shiva
 
అలాగే గోదాదేవి పాశురాలను సోమవారం పూట పఠిస్తే సకల సంపదలు చేకూరుతాయి. ధనుర్మాస కాలంలో శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రశాయి ఆలయం, శ్రీరంగంలోని రంగనాథుని కోవెల దర్శంచడం మంగళకరమని అంటారు. ధనుర్మాస వ్రతం ఇహపర ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ధనుర్మాస సోమవారం పూజ సర్వకార్యసిద్ధిని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

27-12-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు - ఆదిత్య హృదయం చదవినా..?