Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

27-12-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు - ఆదిత్య హృదయం చదవినా..?

27-12-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు - ఆదిత్య హృదయం చదవినా..?
, ఆదివారం, 27 డిశెంబరు 2020 (04:00 IST)
ఆదిత్య హృదయం చదవినా లేక విన్నా సర్వదా శుభం కలుగుతుంది. 
 
మేషం: విందు, వినోదాలలో చురుకుగా పాల్గొంటారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యుత్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
వృషభం: వాతావరణంలో మార్పుతో రైతులు ఊరట చెందుతారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి దానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. అర్థాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు.
 
మిథునం: దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. స్త్రీలు, టీవీ ఛానల్స్ కార్యక్రమాల్లో బాగుగా రాణిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం: మీ కళత్ర మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. రాజకీయాల్లో వారి కార్యక్రమాలు వాయిదా పడటం వల్ల ఆందోళనకు గురౌతారు. స్త్రీలకు తమ బంధువర్గాల నుంచి సంతోషకరమైన వార్తలు అందుతాయి. మనశ్శాంతి కోసం కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం క్షేమదాయకం.
 
సింహం: ధనం కంటే ఇచ్చిన మాటకు విలువనిస్తారు. విదేశీ చదువులు, నిరుద్యోగులు ఉద్యోగ యత్నంలో సఫలీకృతులవుతారు. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండట శ్రేయస్కరం. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.  
 
కన్య: నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల సమాచారం అందుతుంది. విద్యార్థులకు స్నేహ బంధాలు బలపడతాయి. రహస్యాలు దాచిపెట్టలేని బలహీనత ఇబ్బందులకు దారితీస్తుంది. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను సమర్థంగా ఎదుర్కొంటారు. 
 
తుల: కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మిమ్ములను కాదనే వారే మీకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తారు. ప్రయాణాలు ప్రశాంతంగా సాగుతాయి. చెక్కుల జారీ, చెల్లింపుల్లో మెలకువ వహించండి. 
 
వృశ్చికం: ఒప్పందాలు, సంప్రదింపులు ఫలిస్తాయి. గతంలో ఇచ్చిన హామీ వల్ల వర్తమానంలో ఇబ్బందులు తప్పవు. రహస్య విరోధులు అధికం కావడం వల్ల రాజకీయాల్లో వారికి ఆందోళన తప్పదు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం వంటి చికాకులు అధికం. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశం లభిస్తుంది.
 
ధనస్సు: దంపతుల మధ్య అవగాహన లోపం, పట్టింపులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. కొన్ని విషయాలు చూసీచూడనట్లుగా పోవాలి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. దైవ కార్యాలు, వైద్య సేవలకు బాగా వ్యయం చేస్తారు. 
 
మకరం: ఆస్తి పంపకాల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. దైవకార్యాలకు ధనం బాగా వెచ్చిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. పనివారల నిర్లక్ష్యం ఆగ్రహం కలిగిస్తుంది. ఏ విషయంపైనా శ్రద్ధ వహించలేరు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు.
 
కుంభం: వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. బకాయిలు, ఇంటి అద్దెల వసూళ్లలో సంయమనం పాటించండి. విద్యార్థులకు కోరుకున్న అవకాశం లభిస్తుంది. ఎలాంటి సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కొంటారు. స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యల ప్రభావం అధికం. మీ ఆరాటం, ఉత్సాహాలను అదుపులో వుంచుకోవాలి. 
 
మీనం: దంతాలు, ఎముకలు, నేత్ర సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. స్థోమతకు మించిన ధనసహాయం, హామీలు ఇరకాటానికి  గురిచేస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. చేపట్టిన పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. మిమ్ములను కలవరపరిచిన సంఘటన తేలికగా సమసిపోతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలియుగ అంతానికి మానవుల పరిస్థితి ఎలా వుంటుంది?