Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

25-12-2020 శుక్రవారం దినఫలాలు - విష్ణుమూర్తిని ఆరాధించి అన్నదానం చేస్తే...

25-12-2020 శుక్రవారం దినఫలాలు - విష్ణుమూర్తిని ఆరాధించి అన్నదానం చేస్తే...
, శుక్రవారం, 25 డిశెంబరు 2020 (05:00 IST)
మేషం : రావలసిన ధనం కొంత ముందువెనుకలుగానైనా అందుతుంది. ఆకస్మికంగా బంధు మిత్రుల రాకతో గృహం కళకళలాడుతుంది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి అధికం. వృత్తి వ్యాపారాలకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ వుండదు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు కలహాలు చోటుచేసుకుంటాయి. 
 
వృషభం : సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్నవాటిపైనే శ్రద్ధ వహించండి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మాటతీరు, పద్దతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. దుబారా ఖర్చులు అధికం. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
మిథునం : బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు వృత్తులు వారికి సదావకాశాలు లభిస్తాయి. కళాకారులకు చేయు యత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు, వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి. కళాకారులకు క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఒక అవకాశం అందివచ్చినట్లే వచ్చి చేజారిపోయే ఆస్కారంవుంది. 
 
కర్కాటకం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. రాజకీయాలలోని వారికి ఊహించని అవరోధాలు తలెత్తినా తెలివితో పరిష్కరిస్తారు. మీ వాక్‌చాతుర్యమునకు తెలివితేటలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఫలసాయం ఆశించినత సంతృప్తికరంగా ఉండదు. 
 
సింహం : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. స్త్రీలకు పనివారలతో చికాకులు, పనిభారం తప్పవు. విదేశీ పర్యటన ఏర్పాట్లు ముమ్మరం కాగలవు. కావలసిన పత్రాలు సమయానికి కనిపించవు. హామీలు, మధ్యవర్తిత్వాలు ఇబ్బందికి గురిచేస్తాయి. 
 
కన్య : దంపతుల మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడతాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. బ్యాంకు పనులు, దూర ప్రయాణాలో జాగ్రత్త చాలా అవసరం. వాతావరణంలో మార్పు వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దుబారా ఖర్చులు చేస్తారు. 
 
తుల : చిరు వ్యాపారులకు సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. విద్యార్థులు క్రీడలు, క్యాంపస్ సెలక్షన్లలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంటాబయటా మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా జాగ్రత్త వహించండి. 
 
వృశ్చికం : గృహంలో మార్పులు, చేర్పులకు అనుకూలం. ప్రింటింగ్ రంగాల వారికి పనివారలతో సమస్యలు తప్పవు. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి సామాన్యం. శ్రీవారు, శ్రీమతిల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తికానవస్తుంది.
 
ధనస్సు : ఆర్థిక, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. బంధు మిత్రులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు సన్నాహాలు సాగిస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గతంలో వాయిదాపడిన పనులు పూర్తి చేస్తారు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. 
 
మకరం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. పాత మిత్రుల కలయిక మీకు సంతృప్తినిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చుతప్పులు పడుటవల్ల మాటపడతారు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. 
 
కుంభం : తలపెట్టిన పనులు అనుకున్నవిధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు మాట్లాడలేనిచోట మౌనం వహించండి మంచిది. 
 
మీనం : ఉద్యోగస్తులు విలువైన కానుకలు అందించి అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ధనం ఎంత వస్తున్న నిల్వ చేయలేకపోతారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, చికాకులు తప్పవు. పాత రుణాలు తీరుస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకుంఠ ఏకాదశి: ఉప్పు, చింతపండు చేర్చకూడదట..!