Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

20-12-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు.. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే..?

20-12-2020- ఆదివారం మీ రాశి ఫలితాలు.. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే..?
, ఆదివారం, 20 డిశెంబరు 2020 (05:00 IST)
Lord Muruga
సుబ్రహ్మణ్య స్వామిని పూజించినా సర్వదా శుభం, జయం చేకూరుతుంది. 
 
మేషం: ఆర్థిక వ్యవహరాలు, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య రసాయన వ్యాపారస్తులకు లాభదాయకం. కుటుంబీకుల నుంచి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక సంతృప్తినిస్తుంది. 
 
వృషభం: ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయ. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. నేడు అనుకూలించని యత్నం రేపు ఫలిస్తుంది. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు బలపడతాయి. 
 
మిథునం: ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధన వ్యయం అవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ సంతానం మొండి వైఖరి చికాకు కలిగిస్తుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమించిన కొలదీ ఆదాయం. వేళకాని వేళలో బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
కర్కాటకం: మీ రాక సన్నిహితులకు సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం, ఉద్యోగావకాశం లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. హోటల్ తినుబండ, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. గృహోపకరణాలు, వాహనం సమకూర్చుకుంటారు. 
 
సింహం: చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టుల అనుకూలతకు మరికొంత సమయం పడుతుంది. ఉద్యోగ యత్నంలో బిడియం, నిరుత్సాహం విడనాడండి.
 
కన్య: ఉపాధ్యాయులకు పనిభారం అధికం. స్థిరచరాస్తుల విషయంలో ఏకీభావం కుదరదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతాయి. స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీకు నచ్చని విషయాలను సున్నితంగా తెలియజేయండి.
 
తుల: ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. స్త్రీలకు పనివారలతో చికాకులను ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యంలో సంతృప్తి కానవస్తుంది. పాత రుణాలు తీరుస్తారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయకండి.
 
వృశ్చికం: ప్రైవేట్ విద్యా సంస్థల్లోని వారికి ఒత్తిడి, త్రిప్పట, అదనపు పనిభారం వంటి చికాకులు తప్పవు. కొత్త ఆలోచనలు, పథకాలతో వ్యాపారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం, స్వల్ప ఆటంకాలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
ధనస్సు: స్థిరాస్తి క్రయ విక్రయాలు వాయిదా వేయండి. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. ప్రత్యర్థుల తీరును గమనించి తదనుగుణంగా మెలగండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం.
 
మకరం: ఆత్మీయులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. ప్రముఖులతో ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
 
కుంభం: కళ, క్రీడా, కంప్యూటర్ రంగాల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన ముఖ్యం. బ్యాంకు అపరిచిత వ్యవహారాల్లో మెళకువ అవసరం. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో బిజీగా వుంటారు.
 
మీనం: ప్రైవేట్ సంస్థల్లోని వారికి బరువు బాధ్యతల నుంచి విశ్రాంతి పొందుతారు. ఆత్మీయుల ఆకస్మిక రాక సంతోషం కలిగిస్తుంది. గృహానికి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు టీవా ఛానెళ్లు, పత్రికా సంస్థల నుంచి పారితోషికం అందుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీగా పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం, ఎంతో తెలుసా?